గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (17:41 IST)

హీరో రాజ్‌తరుణ్ నిందితుడే - చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు (Video)

rajtarun lavanya
హీరో రాజ్‌తరుణ్ నిందితుడేనని, అందువల్ల ఓ యువతి ఆయనపై చేసిన ఆరోపణలకు సంబంధించి చార్జిషీటును తయారు చేసి దాఖలు చేసినట్టు తెలిపారు. పదేళ్లపాటు తనతో సహజీవనం చేసి, మరో హీరోయిన్ మోజులోపడి తన నుంచి వెళ్లిపోయాడంటూ హీరో రాజ్‍‌తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
తాజాగా లావణ్య ఆరోపణల్లో నిజం ఉందని పేర్కొన్న పోలీసులు.. చార్జిషీటు తయారు చేశారు. రాజ్‌తరుణ్‌పై పోలీసులు చార్జిషీట్ చేయడం పట్ల లావణ్య స్పందించారు. రాణ్ తరుణ్‌పై చార్జిషీట్ శుభపరిణామం అని వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగిందని, తాను న్యాయం కోసం పోరాడుతున్నట్టు స్పష్టం చేశారు. తనపై ఎన్నో నిందలు వేశారని, చివరకు న్యాయమే గెలుస్తుందని తెలిపారు. 

రాజ్ తరుణ్ వెళ్లిపోయాక మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని లావణ్య వెల్లడించారు. రాజ్ తరుణ్, తాను పదేళ్ల పాటు  సంసారం చేశామన్నది వాస్తవం అని తెలిపారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ పోలీసులకు ఇచ్చానని చెప్పారు.