1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ramgopal Verma says 'Vyooham' will not be swept away by Cyclone 'Salaar'

'సలార్' సైక్లోన్‌కి 'వ్యూహం' కొట్టుకుపోదంటున్న రాంగోపాల్ వర్మ

Prabhas
కర్టెసి-ట్విట్టర్
ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 400 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదుల కాబోతోంది. ఇందులో ప్రభాస్, పృధ్వీరాజ్ నటన అద్భుతంగా వుంటుందని చెపుతున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. సలార్‌తో మా వ్యూహం సినిమాకు పోటీ ఉండదని అంటున్నారు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. వ్యూహం, సలార్ రెండు వేర్వేరు జానర్ మూవీస్. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు సెపరేట్‌గా ఉంటారు. ఈ కథలోని అంశాలు ప్రజలందరికీ తెలిసిన విషయాలు కావు. ఇన్ సైడ్ జరిగిన విషయాలు. అలాంటి అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం.
 
పవన్ కల్యాణ్ జనసేన పెట్టినప్పుడు ప్రసంగం విన్నాను. ఆ తర్వాత పవన్ స్టెప్స్ చూస్తే... ఆయన రాజకీయ ప్రయాణంలో స్థిరత్వం లేదనిపించింది. ఏ విషయాన్నైనా ఎవరికి వారు వారి కోణంలో అర్థం చేసుకుంటారు. వ్యూహం నాకు అర్థమైన కోణంలో రూపొందించిన సినిమా. వ్యూహంలో మీకున్న డౌట్స్ నా రాబోయో మూవీ శపథం చూస్తే క్లియర్ అవుతాయి అని అన్నారు.
తర్వాతి కథనం
కోడలు లావణ్య త్రిపాఠికి మెగా బ్రదర్ స్పెషల్ పోస్ట్