శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (15:54 IST)

హనీమూన్ ట్రిప్‌లో రానా-మిహికా.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ ఫోటో

Rana-Miheeka Bajaj
రానా, మిహికాకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఏదో ప్రదేశంలో ఈ నూతన జంట ఎంజాయ్ చేస్తూ ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోని మిహికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఫ్యాన్స్ కామెంట్స్‌, లైకులతో ఈ ఫోటోని ట్రెండింగ్‌లోకి వచ్చేలా చేస్తున్నారు. మరోవైపు రానా- మిహికా ప్రస్తుతం హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారని, ఆ సందర్భంలో దిగిన ఫోటోనే ఇది అంటూ కొందరు ఆ ఫోటోకు కామెంట్స్ పెడుతున్నారు.
 
అంతకుముందు కరోనా వైరస్ విజృంభించడంతో లాక్‌డౌన్ సమయంలో కొందరే అతిథుల మధ్య రానా- మిహికా బజాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరగగా, పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక పెళ్ళి తర్వాత జరిగిన వ్రతానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం రానా, మిహికాలకు సంబంధించిన హనీమూన్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.