ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (14:01 IST)

బిగ్ బాస్ క్రేజ్ గోవిందా... రానా యారీ క్రేజ్ అదుర్స్.. ఎందుకని?

బిగ్ బాస్ క్రేజ్ అమాంతం తగ్గిపోతోంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ద్వారా రేటింగ్ పడిపోతోంది. జూలై 16న ప్రారంభమైన బిగ్ బాగ్ కార్యక్రమానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రియ

బిగ్ బాస్ క్రేజ్ అమాంతం తగ్గిపోతోంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ద్వారా రేటింగ్ పడిపోతోంది. జూలై 16న ప్రారంభమైన బిగ్ బాగ్ కార్యక్రమానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రియాల్టీ షో ద్వారా ఎపిసోడ్స్ పెరుగుతున్నప్పటికీ రేటింగ్ మాత్రం తగ్గుతూ వస్తోంది. సెప్టెంబ‌ర్ 24న చివ‌రి ఎపిసోడ్ ప్రారంభం కానున్న బిగ్‌బాస్ రియాల్టీ షోకు చాలా తక్కువగా రేటింగ్ వస్తున్నట్లు సమాచారం. 
 
జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా కనిపించే వారాంతపు ఎపిసోడ్స్ రేటింగ్స్ కూడా పడిపోతున్నట్లు సమాచారం. అయితే బాహుబలి భల్లాలదేవుడు దగ్గుబాటి రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే నెం.1 యారి మాత్రం రేటింగ్ విషయంలో దూసుకుపోతోంది. రానా హోస్టింగ్ పద్ధతితో పాటు ఆ షోకు వచ్చే స్టార్ల క్రేజ్‌ను బట్టి రేటింగ్ పెరిగిపోతోంది. అయితే బిగ్ బాస్ మాత్రం రోజురోజుకీ రేటింగ్ విషయంలో డౌన్ అవుతోంది. 
 
ప్ర‌స్తుతం బిగ్‌బాస్ సీజ‌న్ 1 విజేత బ‌రిలో హ‌రితేజ‌, న‌వ‌దీప్‌, శివ‌బాలాజీలు ఉన్నారు. వీరిలో విజేతగా నిలిచిన వారికి రూ.50లక్షలు నగదు బహుమతిగా ఇవ్వనున్నారు. మరి త్వరలో ముగియనున్న బిగ్ బాస్ ద్వారా ఎన్టీఆర్ ఎలా మా రేటింగ్ పెంచుతారో వేచి చూడాలి. ప్రస్తుతానికి జై లవకుశ, నేనే రాజు నేనే మంత్రి (తమిళం) సినిమాల రిలీజ్‌ల్లో ఎన్టీఆర్, రానా బిజీ బిజీగా వున్నారు.