గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (13:04 IST)

రశ్మిక మందన్న తో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రారంభం

SKN and Allu arvind and team
SKN and Allu arvind and team
అనౌన్స్ మెంట్ నుంచే సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగించింది నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది.
 
"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, స్టార్ డైరెక్టర్ మారుతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సాయి రాజేశ్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కనున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.