గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (16:43 IST)

జనవరి 14న రవితేజ రావణాసుర చిత్రం ప్రారంభం

Ravi Teja, Ravanasura
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో రాబోతున్న సూపర్ క్రేజీ మూవీ రావణాసుర. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. దీపా‌వళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రావణాసురలో క‌థానాయ‌కుడు ప‌ది డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తుండ‌డం విశేషం.
 
రావణాసురలో ర‌వితేజ లాయ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా సంక్రాంతి పండక్కి జ‌న‌వ‌రి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. రావణాసుర చిత్రానికి శ్రీకాంత్ విస్సా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ అందించారు. స్టైలిష్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించ‌నున్నారు.
 
 రావణాసుర సినిమాలో రవితేజ విలక్షణమైన పాత్రలో కనిపిస్తాడని పోస్టర్‌లోనే తెలిసిపోతోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. ప్ర‌ముఖ న‌టీన‌టులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నటీనటుల, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.