మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (14:25 IST)

మొగల్తూరులో సంస్మరణ సభ: ప్రభాస్ హాజరు-25 రకాల వంటకాలు

Prabhas
Prabhas
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ జరుగుతోంది. కృష్ణంరాజు స్వగ్రామంలో జరిగే ఈ సంస్మరణ సభకు హీరో ప్రభాస్ హాజరయ్యారు. ప్రభాస్ దాదాపు 12 ఏళ్ల తర్వాత తన సొంతూరుకు వెళ్ళారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు.
 
గురువారం మధ్యాహ్నం అభిమానుల కోసం ప్రభాస్ టీమ్ పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మంది అభిమానుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు భోజనప్రియుడు కావడంతో ఆయనకు ఇష్టమైన వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. 
Food Varieties
Food Varieties
 
25 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేశారు. ఇతరులకు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.