శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (10:19 IST)

హీరోయిన్ల క్యారెక్టర్‌పై కామెంట్లా.. ఎంత మందితో పడుకుందని..?

renu desai
హీరోయిన్ల క్యారెక్టర్‌పై దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ అన్నారు. హీరోయిన్లపై వచ్చే కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి లుక్‌పై, యాక్టింగ్ కామెంట్స్ చేయవచ్చునని.. క్యారెక్టర్‌పై మాత్రం కామెంట్స్ చేయకూడదని చెప్పారు. 
 
ఎంత మందితో పడుకుంది అని మాట్లాడుతూ ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారని రేణూ దేశాయ్ తెలిపారు. ఇలాంటివి మానుకోవాలని సూచించారు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై రాజకీయ విమర్శలు చేసినా, ఆయన మేనిఫెస్టోను విమర్శించినా తనకు ఇబ్బందిలేదన్నారు 
 
అయితే ప్రతిసారీ తనను, తన పిల్లలను లాగడం ఏమిటని ప్రశ్నించారు. తమను టార్గెట్ చేయడం మరీ ఎక్కువవుతోందని.. దాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిదన్నారు. అలాగే అకీరానందన్‌ బర్త్ డే సమయంలో నెలకొన్న వివాదానికి క్లారిటీ ఇచ్చింది.  
 
ఇక రేణు దేశాయ్‌ ఇటీవల "టైగర్‌ నాగేశ్వరరావు" చిత్రంలో హేమలత లవణం పాత్రలో నటించింది. రియల్‌ లైఫ్‌లో ఉన్న పాత్ర ఆమెది. సినిమాలో చివరి పది నిమిషాల్లో వచ్చింది రేణు దేశాయ్‌.

అయితే సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందని అంతా భావించారు. టీమ్‌ కూడా అలానే చెప్పొకొచ్చింది. కానీ తీరా ఆమె పాత్ర నిడివి మరీ తక్కువగా ఉండటం, పైగా అది బలంగా లేకపోవడంతో ఆడియెన్స్‌ని నిరాశ పరిచింది.