శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (13:00 IST)

విజయ్ ''మెర్సెల్'' 'అదిరింది'.. టీజర్‌‌కు 24 గంటల్లోనే కోటి వ్యూస్‌ (#MersalTeaser)

''కత్తి'' సినిమా ద్వారా హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ మాస్ హీరో విజయ్ ప్రస్తుతం మెర్సెల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై కోలీవుడ్‌ ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఇందులో పాటలు తమిళ

''కత్తి'' సినిమా ద్వారా హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ మాస్ హీరో విజయ్ ప్రస్తుతం మెర్సెల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై కోలీవుడ్‌ ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఇందులో పాటలు తమిళ తంబీలకు తెగనచ్చేశాయి. అంతేగాకుండా.. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా సాగడంతో మెర్సెల్ ఎప్పుడొస్తుందా అంటూ ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. 
 
తమిళుల సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా ఈ సినిమా స్టోరీ లైన్ వుంటుందని ఇప్పటికే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెర్సెల్‌లో విజయ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించనున్నారు.
 
ఈ నెల 21వ తేదీన ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ లభించింది. ఒక్క రోజులోనే మెర్సెల్ టీజర్ కోటి వ్యూస్‌ను రాబట్టడం విశేషం. విజయ్‌కి గల క్రేజ్‌కు ఈ సినిమా పట్ల ఫ్యాన్స్ చూపుతున్న ఆసక్తికి ఈ వ్యూసే నిదర్శనమని సినీ పండితులు అంటున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. తెలుగులో అదిరింది అనే పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది.