ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (17:20 IST)

ఆచార్య నుంచి "సానా కష్టం" ఆడియో లిరికల్ సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆచార్య" చిత్రం నుంచి సానా కష్టం అనే పాట లిరికల్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఆదివారం ఈ సాగ్ ప్రోమోను రిలీజ్ చేయగా, సోమవారం పూర్తి సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అందాల భామ రెజీనా కెసాండ్రా నటించగా, సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూర్చగా, భాస్కర్ భట్ల గేయరచన చేశారు. 
 
ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించిగా, కీలక పాత్రను పోషిస్తున్న రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించారు. వచ్చే నెల నాలుగో తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎటర్‌టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మించాయి.