గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 2 జనవరి 2019 (13:27 IST)

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి అదే పెద్ద రీసెర్చ్

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఎన్టీఆర్ అనే మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిస్తోన్న సాయిమాధ‌వ్ బుర్రా మాట్లాడుతూ... చిత్ర విశేషాల‌ను తెలియ‌చేసారు. ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే... నా చిన్నప్పటినుంచీ యన్‌.టి. రామారావుగారికి వీరాభిమానిని. ఆయన బయోపిక్‌కు మాటలందిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి రామారావుగారి సినిమాలు చూస్తూ పెరగడమే పెద్ద రీసెర్చ్ అన్నారు.
 
ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా రాయడానికి ప్రయత్నించాను. బాలకృష్ణ గారు రచయితలను బాగా గౌరవిస్తారు. ఎన్టీఆర్‌గా కొన్ని సన్నివేశాల్లో ఆయన నటిస్తుంటే ఎమోషనల్‌ అయ్యాను. రామారావుగారి గురించి అన్ని సంఘటనలనూ రెండు పార్ట్స్‌లో చూపించడం కష్టం. ఆయన జీవితాన్ని చెప్పాలంటే 10 - 15 సినిమాల్లో చెప్పాలి. అందుకే సినిమాకు ఏది అవసరమో, సమాజానికి ఏది అవసరమో అది మాత్రమే ఉంటుంది అని తెలియ‌చేసారు.