ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (13:14 IST)

హైరాబాద్ పెద్దమ్మతల్లి ఆలయంలో సమంత పూజలు

samantha peddamma thalli
హైదరాబాద్ నగరం, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ సమంత సందర్శించారు. ఆమె బుధవారం ఉదయాన్నే "శాకుంతలం" సినిమా యూనిట్ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 14వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో పెద్దమ్మ తల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఇందులో సమంతతో పాటు ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్, నిర్మాత నీలమ, దేవ్ మోహన్‌లు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో మలయాళీ హీరో దేవ్ మోహన్ ఓ కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. 
 
అదేవిధంగా ప్రకాష్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. పైగా, ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ బాల నటిగా వెండితెరకు పరిచయమవుతుంది. శకుంతల, దుష్యంతనుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ క్రమంలో శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్ ప్రారంభించింది. కాగా, ఇప్పిటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి.