రజినీ తలైవర్ అయితే... మరి కామరాజర్ ఎవరు...?
తమిళనాట రాజకీయాలు సినిమా ఆడియో వేడుకలని కూడా వేడెక్కిస్తున్నాయి... మహిళా పోలీసుల కథాంశంతో వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానరుపై సురేష్ కామాక్షి రూపొందిస్తున్న ‘మిగ మిగ అవసరం’ అనే సినిమాలో శ్రీప్రియాంక పోలీసుగా అధికారిగా, హరీష్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇషాన్ దేవ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
దీనికి సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్, దర్శకుడు చేరన్, సీమాన్, నిర్మాత జేకే రితీష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని పాటలను విడుదల చేయగా ఈ సినిమాకి దర్శకత్వంతోపాటు పోలీసు ఉన్నతాధికారి పాత్రని కూడా పోషించిన సీమాన్ మాట్లాడుతూ... ‘‘తలైవర్’ (అధినేత) అనే పదానికి అర్థం తెలియకుండానే ఇక్కడ ఎంతో మంది జీవిస్తున్నారు. టీవీలో చర్చావేదికలను చూస్తే అందులో పాల్గొనేవారంతా రజనీకాంత్ గురించి మాట్లాడేటప్పుడు ‘తలైవర్’తో నటించాను, ‘తలైవర్’తో మాట్లాడాను, ‘తలైవర్’ను కలిశాను అంటున్నారు.
రజనీకాంత్‌ను ‘తలైవర్’ అంటూ పొగుడుతున్నారు. ఆయన ‘తలైవర్’ అయితే.. కామరాజర్ ఎవరు.. ప్రభాకరన్ ఎవరు.. అంటే వాళ్లంతా దేశ ద్రోహులా..?’ అంటూ నామ్ తమిళర్ కచ్చి పార్టీ అధినేత సీమాన్ ప్రశ్నించారు. మామూలుగానే రజినీ అంటే ప్రాణమిచ్చే తమిళ తంబీలు ఏం బదులివ్వబోతారో వేచి చూడాల్సిందే...