జైలు నుంచి బయటపడ్డ సీనియర్ నటి గీత!
జైలు నుంచి బయటపడితే పక్షిలా ఎగిరి లోకాన్ని చుట్టేయాలనుంటుంది. నటి గీత పరిస్థితి కూడా అలాంటిదేనట. ఈ విషయాన్ని తనే చెప్పింది. చిరంజీవి, ప్రసాద్‌బాబు,కృష్ణంరాజు నటించిన మనవూరి పాండవులు సినిమాలో ఓ పాత్ర పోషించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తమిళం కన్నడ, మలమాళం సినిమాల్లో నటించిన ఆమె పెండ్లి చేసుకున్నాక అమెరికా వెళ్ళిపోయింది. చెన్నైలో పుట్టిపెరగడం ఆ తర్వాత అక్కడ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వారిని పెండ్లి చేసుకోవడం జరిగిందిపోయింది.
ఆమధ్య నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో అమెరికాలో నివశించే హీరో అమ్మపాత్రలో పోషించింది. ఆ తర్వాత కాస్త గేప్ తీసుకుంది. ఇప్పుడు తను ఫ్రీగా వుండాలని ఇకపై సినిమా చేయాలను అనుకుంటున్నట్లు నిన్న ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించింది. ఇన్నాళ్ళు ఏమైపోయారు. ఇప్పుడు ఎలా వచ్చారు అని అలీ ప్రశ్నించగా, ఇప్పటివరకు కుటుంబ బాధ్యతలు చూసుకున్నాను. మా అబ్బాయి ఇప్పుడు చదువుపూర్తయి జాబ్ చేస్తున్నాడు. అప్పుడు ఓ మాట అన్నాడు. ఈ కాస్ట్‌లీ జైలు నుంచి నువ్వు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లు నటనపై దృష్టి పెట్టు అన్నాడు. ఈ విషయాన్ని ఆమె చెబుతున్నప్పుడు మొహంలో ఎంతో ఆనందం కలిగింది.
సహజంగా అమెరికాలో జాబ్ చేస్తున్న పిల్లలను వారి తల్లిదండ్రులు చూడడానికి వెళితే ఇంటిలోంచి బయటకురావాలంటే మన ఇండియాలోలా కుదరదు. అక్కడ ఇరుగుపొరుగు ఎవరూ మాట్లాడరు. ఫ్రీగా రోడ్డుమీద తిరిగితే దుండగులు కాల్చేస్తారు కూడా. అలాంటి వాతావరణం వున్న అమెరికాలో సీనియర్ నటి గీత ఇంట్లోనే ఎప్పుడు వుండడంతో కాస్ట్‌లీ ఖైదీగా వున్నానని ఆమె కొడుకే చెప్పాడంటే అమ్మ ఎంత ఖైదీగా వుందో తెలియజేశౄడు. సో. ఈ విషయాన్ని గీత క్లారిటీగా చెప్పడం కూడా విశేషమేకదా..