సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 అక్టోబరు 2020 (09:55 IST)

రింగ్ లైట్‌లో అందాలు ఆరబోస్తున్న శ్రద్ధా దాస్!

సినిమా హీరోయిన్లు అంటేనే అందాలు ఆరబోతకు పెట్టింది పేరు. ముఖ్యంగా, తమ పబ్లిసిటీ కాస్తంత తగ్గుతుందని భావిస్తే చాలు... ఏకంగా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారును మత్తెక్కిస్తుంటారు. ఇలాంటివారిలో శ్రద్ధా దాస్ ఒకరు.
 
ఇటు తెలుగు, అటు కన్నడ భాషలతో పాటు.. బాలీవుడ్‌లో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న బ్యూటీ. "సిద్దు ఫ్ర‌మ్ శ్రీకాకుళం" చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ఈ ముంబై భామకు కొన్ని చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉండే శ్ర‌ద్దాదాస్ తాజాగా డిజిటెక్ రింగ్ లైట్ ఫొటోషూట్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్రొఫెష‌న‌ల్ ఫొటోగ్రాఫ‌ర్లు, ఆర్టిస్టుల‌కు, కంటెంట్ క్రియేట‌ర్ల‌కు డిజిటెక్ రింగ్ లైట్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని శ్ర‌ద్దాదాస్ ట్వీట్ చేసింది.
 
ఢిఫ‌రెంట్ క‌ల‌ర్ వేరియేష‌న్స్‌లో, మ‌న‌కు న‌చ్చిన‌ట్టుగా బ్రైట్ నెస్‌ను మార్చుకునే సదుపాయం ఇందులో ఉంద‌ని తెలిపింది శ్ర‌ద్దాదాస్‌. రింగ్ లైట్ మ‌ధ్య‌లో సెల్ ఫోన్ పెట్టుకునే సౌక‌ర్యం కూడా అందుబాటులో ఉంది. రింగ్ లైట్‌ను ఆవ‌శ్య‌క‌త‌ను తెలుపుతూ శ్ర‌ద్దాదాస్ దిగిన ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.