శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (11:36 IST)

పెళ్లికి ముందే డేటింగ్ చేయమని కుమార్తెకు చెప్పా : శ్వేతా తివారీ

swetha - palak tiwari
తనకు మూడుముళ్ళ బంధంపై నమ్మకం లేదని, అందువల్ల ఎవరితోనైనా రిలేషన్ ఉంటే పెళ్లికి ముందే డేటింగ్ చేయమని తన కుమార్తెకు చెప్పానని నటి శ్వేతా తివారీ చెప్పారు.  అలాగే, తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలని తాను ఒత్తిడి చేయబోనని చెప్పారు. అయితే, పెళ్లికి ముందుకు ఉన్న రిలేషన్‌షిప్‌ను మాత్రం మూడు ముళ్ల బంధం వరకు తీసుకుని రావొద్దని సలహా ఇచ్చానని తెలిపారు. 
 
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు పెళ్లిపై మాత్రం నమ్మకం లేదన్నారు. పెళ్లి చేసుకోమని తన కూతురుని కూడా ఒత్తిడి చేయబోనని చెప్పారు. పెళ్లి విషయంలో తన కూతురి నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. ఎవరి కోసమో మన జీవితాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదని తన కుమార్తెకు చెప్పినట్టు వెల్లడించింది. అయితే, ఏదైనా ఒక పని చేసే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని సూచించానని తెలిపారు. 
 
ఎవరితోనైనా రిలేషన్‌‌లో ఉంటే దాన్ని కొనసాగించమని తన కుమార్తెకు చెప్పానని, ్యితే, ఆ సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకురావొద్దని సూచించానని శ్వేతా తివారీ చెప్పుకొచ్చింది. ఇద్దరు పిల్లలకు సింగిల్ పేరెంట్‌గా ఉన్నప్పటికీ తాను ఎలాంటి ఇబ్బంది పడటం లేదని చెప్పారు. డబ్బు కోసమో లేక మరో అవసరం కోసమే తన మాజీ భర్తను ఎన్నడూ సాయం కోరలేదని, రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇపుడు ఒక్కరితో కూడా కలిసివుండటం లేదంటూ తనపై సాగుతున్న ప్రచారాన్ని అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశారు.