బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (21:19 IST)

కరోనా వైరస్ మా ఇంటికి వచ్చింది.. పాప్ సింగర్ స్మిత

కరోనా వైరస్ విజృంభిస్తోంది. పేదధనిక వర్గం తేడా లేకుండా అన్ని వర్గాల వారిని కరోనా పట్టి పీడిస్తోంది. ప్రజాప్రతినిధులకు, సెలెబ్రిటీలకు కరోనా సులభంగా సోకుతోంది.

ఈ జాబితాలో ప్రస్తుతం పాప్ సింగర్ స్మిత కూడా చేరిపోయింది. పాప్ సింగర్ స్మితకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
''నిన్న వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల బాడీ పెయిన్స్ వచ్చాయనుకున్నా... కానీ ఎందుకైనా మంచిదని శశాంక్, నేను కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాం, పాజిటివ్‌గా తేలింది. ప్లాస్మా దానం చేయండి.. మేము ఇంట్లో జాగ్రత్తగా ఉన్నా... కరోనా మా ఇంటికి వచ్చింది." అని స్మిత ట్వీట్ చేశారు. 
 
మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా వారికి మాత్రం నెగిటివ్‌గా తేలింది. "ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనాగా తేలింది. త్వరలోనే కోవిడ్‌ను తరిమికొడతాను.. ప్లాస్మా దానం చేయండి" అని పాప్ సింగర్ స్మితా కోరారు.