శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:20 IST)

మొరిగే కుక్కలు ప్రతిచోటా ఉంటాయి.. అధైర్య పడకండి రోజాగారూ? శ్రీరెడ్డి

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే రోజాపై పడింది. చిత్తూరులోని సుందరయ్య నగర్‌లో బోరు బావి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే రోజాకు అక్కడి స్థానిక మహిళలు పూల స్వాగతం పలికారు. రోజా నడుస్తూ ఉంటే చాలా మంది మహిళలు ఆమె కాళ్లపై పూలు జల్లుతూ అభిమానాన్ని చూపించారు.

అయితే రోజా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఆమెపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ.. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ తాట తీస్తానని రోజా గట్టి వార్నింగ్ ఇచ్చారు. 
 
మొత్తానికి ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుండగా.. శ్రీరెడ్డి ప్రస్తుతం ఈ వివాదంపై స్పందించింది. "రోజా గారూ మీరు పేద ప్రజలకు మంచి మంచి పనులు చేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లండి మొరిగే కుక్కలు ప్రతిచోటా ఉంటాయి.. అధైర్య పడకండి.. మీరు ఒంటరి కాదు. మీకు సపోర్ట్‌గా మేం ఉన్నాం'' అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

కానీ గతంలో రోజాపై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ అప్పట్లో ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి అగ్గిరాజేసిన సంగతి విదితమే.