శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (15:14 IST)

#RRR భారీ షెడ్యూల్ కోసం బయలుదేరుతున్నా : ఎన్టీఆర్

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్‌లు పూర్తయిన ఈ సినిమా తదుపరి భారీ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ కోసం హీరోయిన్లు, హీరోలు రెడీ అయిపోయారు. 
 
ఈ విషయాన్నే తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 'ఆర్ఆర్ఆర్ భారీ షెడ్యూల్... నేను బయలుదేరుతున్నాను' అని పోస్ట్ చేసి విమాన టిక్కెట్‌ల ఫోటోను కూడా పోస్ట్ చేసాడు. ఎన్టీఆర్ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే వేలమంది ఆ ట్వీట్‌ను లైక్ చేసారు. 
 
అంతేకాకుండా వేలకొద్దీ అభిమానులు కామెంట్లలో శుభాకాంక్షలు తెలియజేసారు. హ్యాపీ జర్నీ అన్నా... ఆల్ ద బెస్ట్ తారక్... మాకు సినిమా అప్‌డేట్స్ ఇస్తూ ఉండు... నీతో సెల్ఫీ దిగాలనుంది... ఐ లవ్ యూ... అంటూ వేలసంఖ్యలో కామెంట్లు చేసారు.