శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (18:54 IST)

సూపర్ స్టార్ రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ లాల్ సలామ్ విడుదల తేదీ ప్రకటన

lal salam poster
lal salam poster
సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ‘లాల్ సలామ్’ ఫిబ్రవరి లో విడుదళ అన్న విషయం పాఠకులకు తెలిసిందే.. కానీ ఈరోజు అధికారికంగా ప్రకటించారు.  విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. భారీ చిత్రాలతో పాటు డిఫరెంట్ చిత్రాలను రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ నటిస్తోన్న సినిమా కావటంతో ‘లాల్ సలామ్’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అదీ కాకుండా ఆయన బాషా చిత్రం తర్వాత ముంబై బ్యాక్ డ్రాప్‌లో చేసిన సినిమా ఇది. 
 
ఇందులో ఆయన  మెయినుద్దీన్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మంచి క్రికెట‌ర్స్‌, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువ‌కులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట‌ను మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటే ఆ గొడ‌వ‌ల‌ను మొయిద్దీన్ భాయ్ ఎలా స‌ర్దుబాటు చేశారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఎలాంటి స‌ఖ్య‌త‌ను కుదిర్చార‌నేది ‘లాల్ స‌లామ్‌’ సినిమా ప్రధాన కథాంశంగా రూపొందింది. 
 
ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు. విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫీీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 
 
నటీనటులు: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క‌పిల్ దేవ్‌, సెంథిల్, తంబి రామ‌య్య‌, అనంతిక‌, వివేక్ ప్ర‌స‌న్న‌, తంగ దురై త‌దిత‌రులు