ప్రేక్షకులే దేవుళ్ళు అనేది ఒట్టిమాటనేనా!
krishnareddy, kalpana, achireddy
సినిమారంగంలో దేవుడి సెంటిమెంట్‌కు అగ్రపీఠం వుంది. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు వారివారి నమ్మకాలపై చేస్తుంటారు. అదే సినిమా విడుదలకుముందు టెన్షన్ వుంటుంది. గుళ్ళు గోపురాలు, దేవుళ్ళ దర్శనం, వేదమంత్రాలతో అర్చన వంటివన్ని చేస్తుంటారు. పొరపాటున సినిమా హిట్ అయితే మాత్రం ప్రేక్షకులే దేవుళ్ళు. వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని, ఊరూరా విజయ యాత్ర చేస్తుంటారు. అక్కడ ప్రేక్షకులు, జనాలతో పబ్లిసిటీ ఇచ్చి ప్రేక్షకుల్ని మాత్రమే దేవుడుగా కీర్తిస్తారు.
కానీ అసలు లోపల వేరే వుంటుంది. అసలు దేవుడు వేరే వున్నాడు. అందుకే సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత కూడా అమ్మవారిని, అయ్యవారిని ఇలా రకరకాలుగా దేవాలయాన్ని దర్శించి పూజలు చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. కనుకనే ఈరోజు ఎస్.వి.కృష్ణారెడ్డి తన సినిమాను సక్సెస్ చేయాలని దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు.
రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తాజా మూవీ ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు. కోనేరు కల్పన నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో సోహెల్, మృణాళిని హీరోహీరోయిన్లుగా నటించారు. కె.అచ్చిరెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. ఇక సినిమా విడుదల సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులతో కలిసి సినిమా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకుడు అచ్చి రెడ్డిలతో కలిసి నిర్మాత కోనేరు కల్పన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా విజయవంతం కావాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్దించారు. ఇక అనంతరం ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు యూనిట్ సభ్యులకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.