ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (15:47 IST)

కర్నూలులో ఫ్యామిలీ వేడుక‌గా ది ఘోస్ట్

Naga Chaitanya, Akhil, Nagarjuna
Naga Chaitanya, Akhil, Nagarjuna
అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్'  ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరగనుంది. ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి  ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకని మరింత ప్రత్యేకంగా చేయడానికి నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ తండ్రీ కొడుకులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగ కానుంది.
 
'ది ఘోస్ట్'  టీమ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో అలరిస్తోంది. నిన్న నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటెన్స్ ట్రైనింగ్ చూపించే వీడియో- గన్స్, స్వోర్డ్స్‌ని విడుదల చేసారు.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.