Akhil Raj, Ananya Nagalla, Kashi Viswanath
రెండు ప్రపంచాలు ప్రేమను ఎలా పరిచయం చేస్తాయి అనే కథాంశంతో శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై అఖిల్ రాజ్, అనన్య నాగల్ల జంటగా సూర్య అల్లంకొండ దర్శకత్వం లో జి. ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్న శ్రీ దుర్గ క్రియేషన్స్ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో ఘనంగా ప్రారంభమయ్యాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల నాంది పూజా కార్యక్రమాలు ప్రారంభించగా నటుడు దగ్గుపాటి అభిరామ్ హీరో హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటుడు కాశీ విశ్వనాధ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
చిత్ర హీరోయిన్ అనన్య నాగల్ల మాట్లాడుతూ.. దర్శకుడు సూర్య గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఇదొక మంచి లవ్ స్టోరీ .ఈ కథపై మేమంతా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాము. ఇలాంటి మంచి స్టోరీ కు హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
చిత్ర దర్శకుడు సూర్య అల్లంకొండ మాట్లాడుతూ. ఇది నా మొదటి చిత్రం ఇది కంప్లీట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈస్ట్ గోదావరి, పల్లమ్ వంటి ఔట్ అఫ్ స్టేషన్ లలో షూటింగ్ జరుగుతుంది.అఖిల్ రాజ్, అనన్య నాగల్ల ఇందులో హీరో, హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్ దొరికారు. ఆగష్టు నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాను రెండు షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. నాకిలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు అన్నారు.
చిత్ర నిర్మాత జి. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన , పెద్దలకు ధన్య వాదములు. సూర్య అల్లంకొండ నాకు మంచి లవ్ స్టోరీ చెప్పగానే ఈ కథ నచ్చి శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను .ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి లవ్ సబ్జెక్టుతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర హీరో అఖిల్ రాజ్, మాట్లాడుతూ..ఇంతకుముందు చిన్న చిన్న యూట్యూబ్ లలో చేసిన తరువాత రెండు సినిమాలు చేశాను. ఇది నా మూడవ సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
సినిమాటోగ్రాఫర్ వి. ఆర్. కె. నాయుడు మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ సూర్య మంచి ట్యాలెంట్ ఉన్న దర్శకుడు ఇంతకు ముందు తనతో రెండు ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది.మళ్ళీ ఈ సినిమా ద్వారా తనతో ట్రావెల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మంచి లవ్ స్టోరీ ఉన్న కథకు డి. ఓ. పి వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు
డైలాగ్ రైటర్ మాట్లాడుతూ..రెండు ప్రపంచాలు ప్రేమను ఎలా పరిచయం చేస్తాయి అనే కథ నాకు బాగా నచ్చడంతో ఈ కథను ఇంకా బాగా రాయాలని ముందుకు వెళ్తున్నాము. శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై జి. ప్రతాప్ రెడ్డి నిర్మిస్తుండగా సూర్య అల్లంకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ పి. ఆర్. మాట్లాడుతూ..సూర్య గారు నాకు చెప్పిన కథ అద్భుతంగా ఉంది. నాకే కాకుండా నిర్మాతకు కూడా నచ్చడంతో ఈ సినిమాను శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు పాటలు బాగా కుదిరాయి.ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : శ్రీ దుర్గా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ప్రొడ్యూసర్ : జి ప్రసాద్ రెడ్డి
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ : సూర్య అల్లం కొండ
కో-ప్రొడ్యుసర్ : నవీన్ బి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్
సినిమాటోగ్రఫీ : వి ఆర్ కె నాయుడు
మ్యూజిక్ డైరెక్టర్ : పి ఆర్
ఆర్ట్ డైరెక్టర్ : ధర రమేష్ బాబు
పి. ఆర్. ఓ : వంశీ కాక
పబ్లిసిటీ డిజైనర్ : కృష్ణ ప్రసాద్
ఎడిటర్ : ప్రణవ్
డైలాగ్స్ : పవన్ రైటింగ్
ప్రొడక్షన్ కంట్రోలర్ : బీసీ చౌదరి
కాస్ట్యూమ్ డిజైనర్ ::నిహారిక
కో డైరెక్టర్ : ఏం మధుసూదన్ రెడ్డి
------------------------------------------------------------
సందీప్ కళ్ళను చూడగానే మనవూరి పాండవులులో చిరంజీవి గుర్తుకువచ్చారు- గంధర్వ ప్రీరిలీజ్ వేడుకలో మురళీమోహన్
తెలుగులో ఇంతవరకు రాని సరికొత్త పాయింట్‌తో గంధర్వ వస్తోంది - గంధర్వ ప్రీరిలీజ్ వేడుకలో వక్తలు
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. సురేష్ కొండేటి సమర్పణలో అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని అబ్దుల్ నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మంగళశారం రాత్రి హైదరాబాద్‌లో గంధర్వ ప్రీరిలీజ్ వేడుక జరిగింది.
ఈ సందర్భంగా చిత్రంలోని మొదటి పాటను సిల్లీమోంక్స్ అధినేత సంజయ్, నటుడు బాబూమోహన్ ఆవిష్కరించగా, రెండో పాటను దర్జా నిర్మాత శివశంకర్, దర్శకుడు చంద్రమహేష్ ఆవిష్కరించారు.
అనంతరం ఈ చిత్రాన్ని ప్రసాద్ మల్టీప్లెక్‌లో చూసేందుకు మొదటి టికెట్‌ను చిన్నారులు శాన్వీ, ఆద్య, హర్షితలు లక్ష రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ టికెట్‌ను ముఖ్య అతిథి మురళీమోహన్ విడుదల చేశారు.
అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ, నాకు చాలా సంతోషంగా వుంది. గంధర్వ టైటిల్లోనే పరిమళం కనిపించింది. యువకులంతా చేసిన సినిమా ఇది. సురేష్ కొండేటి కొన్నాడనగానే మరింత సంతోషం వేసింది. ఆయనది గోల్డెన్ హ్యాండ్. రిపోర్ట్‌గా వచ్చి సంతోషం మ్యాగజైన్ స్థాపించడమేకాకుండా సౌత్‌లోని నాలుగు భాషల్లోనూ సినిమా అవార్డులు ఇస్తున్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రభుత్వాలు కూడా చేయని పని చేస్తున్నారు. అలాంటి గోల్డెన్ హ్యాండ్ గంధర్వ తీసుకున్నారు. ఇక సందీప్‌ను చూడగానే నేను చిరంజీవిగారితో `మనఊరి పాండవులు` చేశాను. చిరంజీవిగారు కన్నెర చేస్తే ఎలా వుంటుందో సందీప్ కళ్ళను చూస్తే అలా అనిపించింది. ఆయనకు మంచి భవిష్యత్ వుంది. సీనియర్ నటుడు కె.కె. శర్మగారి మనవుడు అని తెలిశాక మరింత ఆనందమేసింది. ఇక సినిమాలో పాటలు షకీల్ బాగా చేశారు. అప్సర్ దర్శకత్వం చాలా బాగుంది. మంచి సినిమా తీశారు. ముందుముందు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సాయికుమార్ నేను కలిసి దేవుడు చేసిన పెళ్లి సినిమాతో కెరీర్ ప్రారంభించాం. సురేష్ కూడా నటించాడు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.
డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ, కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాం. మంచి ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరూ జూలై 8న థియేటర్‌లో చూడండి అని తెలిపారు.
హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ, సాయికుమార్ రాకతో మా సినిమా హైప్ పెరిగింది. బాబూమోహన్‌గారితో నటించడం చాలా ఆనందంగా వుంది. కథను నమ్మి, నన్ను నమ్మి సుభానిగారు పెట్టుబడి పెట్టారు. అప్సర్ చెప్పిన కథ చాలా వినూత్నంగా అనిపించింది. గాయత్రీ సురేష్ అందంతోపాటు అభినయం చాలా బాగుంది. ఆమె చేసిన ఇటర్‌వెల్ సీన్ హైలైట్ అవుతుంది. సురేష్ కొండేటిటారు సినిమా తీసుకున్నారనగానే చాలా సంతోషంగా అనిపించింది. ఆంధ్ర, తెలంగాణలో 500 థియేటర్లలో రాబోతుంది. అందరికీ థ్యాంక్స్ అన్నారు.
మరో అతిథి ఆకాష్ పూరీ మాట్లాడుతూ, గంధర్వ పోస్టర్ చూడగానే ఫ్రెష్ లుక్ అనిపించింది. ట్రైలర్ చూశాను. ఆసక్తికరంగా వుంది. కథకూడా తెలుసుకున్నాను. చాలా కొత్తగా వుంది. జ్యోతిలక్ష్మీ సినిమాలో శాండీ చిన్న పాత్ర వేశాడు. ఆయన చెప్పిన ఒక్క డైలాగ్‌తోనే మంచి నటుడు అనిపించాడు. ఇప్పుడు హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఆల్‌ది బెస్ట్ అందరికీ అని తెలిపారు.
చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, ఊరి చివర యుద్ధం చేసేవాడు రైతు. సరిహద్దుల్లో యుద్ధం చేసేవాడు సైనికుడు. ప్రతి విషయంలో గెలవాలంటే మనం యుద్ధం చేయాలి. అలా తల్లిదండ్రులు, మనమూ కూడా పోరాడుతూనే వుంటాము. అలాంటి యుద్ధం పూర్తి చేయడానికి గంధర్వ కారణమైంది. ఇందుకు కెమెరా జవహర్‌నుంచి అందరూ టెక్నీషియన్లు సైనికుల్లా అండగా నిలిచారు. నిత్య యవ్వనుడు అంటే గంధర్వుడు. అలా మా సినిమాకు బాణీలు చేసిన షకీల్ ను అభినందిస్తున్నాను. క్లయిమాక్స్‌లో సరైన క్లూ కోసం ఆలోచిస్తుండగా అదికూడా దొరికింది. షకీల్ ద్వారా సందీప్ నాకు దొరికాడు. గాయత్రీ సురేష్ నటన చూస్తే సావిత్రి గుర్తుకు వస్తుంది. గ్లామర్ పాత్రను శీతల్ పోషించింది. సాయికుమార్, బాబూమోహన్, పోసాని, వీరశంకర్ ఇలా సీనియర్లు నాకు సహకరించారు. నేను సినిమాకు రావడానికి పూరీ, ఆర్‌జీవి, రాజమౌళి వంటివారే స్పూర్తి. ఇక అన్ని విధాలా నా వెనక నిలబడిన ఆయుధమే నా కుటుంబం. ఈ సినిమా సక్సెస్ అయి మరిన్ని సినిమాలు చేసేలా ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
బాబూమోహన్ మాట్లాడుతూ, సాంగ్, ట్రైలర్ చూశాను. సంగీతం ఎవరో సీనియర్ చేశాడనుకున్నా. కుర్రాడు చేశాడు. రీరికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు. తెలుగులో మంచి సంగీత దర్శకుడు దొరికాడు. ఇళయరాజాను మరిపించేలా సంగీతం కూర్చాడు. వంద సినిమాలు చేసిన నిర్మాతగా సుబాని నిర్మించాడు. అందుకు దర్శకుడు నటీనటులతో చేయించిన విధానం బాగుంది. సురేష్ కొండేటి చేతిలో ఈ సినిమా వచ్చాక ఖచ్చితంగా హిట్టే. మంచి సినిమా ప్రేక్షకులముందుకు వస్తుంది. అందరూ ఆదరించండి అని తెలిపారు.
సిల్లీ మాంక్స్ అధినేత సంజయ్ మాట్లాడుతూ, స్నేహితుడి ద్వారా అప్సర్‌ను కలిశాను. ఆర్మీ పర్సన్ సినిమా చేస్తున్నాడని చెప్పారు. చాలామంది ఆర్మీవారిని తప్పుగా చూపుతూ సినిమాలు చేస్తుంటారు. అలా తీయకూడదని అనిపించింది. అయితే ఆర్మీ ఫ్యామిలీనుంచి వచ్చిన అప్సర్, సుబానిగారు తీస్తున్నారంటే కథకు న్యాయం చేస్తారనిపించింది. జార్జిరెడ్డి చిత్రం నుంచి సందీప్ తెలుసు. తను చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా చేయడం ఆయనకు లక్. ఈ సినిమా తర్వాత నెక్ట్ లెవల్‌కు వెళిపోతాడు అని చెప్పారు.
దర్జా చిత్ర నిర్మాత శివశంకర్ మాట్లాడుతూ,ఈ సినిమా చూశాను.భీమవరంలో 8 ఏళ్ళుగా డిస్ట్రిబ్యూటర్గా వున్నాను. సురేష్ కొండేటి చెబితే క్యాజువల్‌గా సినిమా చూశాను. నాకు తెలిసి ఈమధ్య ఇంత మంచి సినిమా రాలేదు. మరోసారి చూడాలనిపించింది. రేపు మీకు అదే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు డీల్ చేసిన విధానం చాలా బాగుంది. మా దర్జా సినిమాకు కంటే షకీల్ ఈ సినిమాకు మంచి సంగీతం ఇచ్చాడు. తెలుగులో ఇంతవరకు రాని కథ. అందరూ కుటుంబంతో సహా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పారు.
దర్శకుడు చంద్రమహేష్ మాట్లాడుతూ, ఈ సినిమా నిర్మాత, దర్శకుడు కలిసి రాసిన కథ. ఇద్దరూ నేవీ అధికారులు. కాబట్టి కథ చాలా బాగా తీసివుంటారు. పాటలు చూశాను. సంగీతం షకీల్ బాగా కూర్చాడు. జార్జిరెడ్డి చూశాక సందీప్‌కు అభిమానినయ్యా. మొదటి సాంగ్ మెలోడీ, రెండో సాంగ్‌లో డాన్స్, పెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. సందీప్ మాస్ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. జవహర్ ఫొటోగ్రపీ చాలా బాగుందని చెప్పారు.
సీనియర్ నటుడు సురేష్ మాట్లాడుతూ, షకీల్ రీరికార్డింగ్‌ను ఇళయారాజను ఫాలో చేశాను అన్నాడు. ఇళయరాజాగారు ఆర్.ఆర్.చేస్తే డైలాగ్‌ను దాటి వెళ్ళడు. ఆయన సినిమా వల్లే నేను వెలుగులోకి వచ్చాను. విజువల్స్ బాగా చూపించారు. అప్సర్ మంచి పాత్ర వుందని ఫోన్ చేస్తే పాయింట్ అడిగాను. ఇది కాన్సెప్ట్ ఫిలిం అంటూ రెండు లైన్లు చెప్పాడు. నేను మెస్మరైజ్ అయ్యాను. వెంటనే చేస్తానన్నాను. ఇక సాయికుమార్, బాబూమోహన్ వంటి వారితో నటించడం సంతోషంగా వుంది. సందీప్ ఈజీగా చేసేశాడు. ప్రతి షాట్‌కు న్యాయం చేశాడు. ఈ సినిమా టీమ్ కోసమే హిట్ కావాలి. ఈ సినిమా ఆర్మీవారు తీసిన కథ. ఇది ఆర్మీవారికి నివాళిగా వుంటుందని భావిస్తున్నాను. ఇలాంటి సినిమాకు సురేష్ కొండేటి పబ్లిసిటీ చేయడం అభినందనీయం. 500 థియేటర్లలో విడుదలకావడం చాలా లక్కీగా భావిస్తున్నాను అన్నారు.
నటి రోహిణి మాట్లాడుతూ, గాయత్రీ మలయాళీయైనా తెలుగు నేర్చుకుని చేసింది. వీరందరితో పని చేయడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు తీసిన విధానం బాగుంది. పాటలు బాగున్నాయి. అందరూ థియేటర్‌లోనే సినిమా చూడండి అని తెలిపారు.
సీనియర్ జర్నలిస్టు ప్రభు మాట్లాడుతూ, గంధర్వ కథ మొదటినుంచీ తెలుసు. డిఫరెంట్ పాయింట్. ఎంటర్‌టైన్‌మెంట్‌లో దాన్ని సాధ్యం చేశాడు అప్సర్. ఎటువంటి అంచనాలు లేకుండా చూస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇటువంటి చిత్రం సురేష్ కొండేటి చేతిలో పడడం అద్భుతం. ఓవర్‌సీస్‌లోకూడా సినిమా విడుదలకాబోతుంది. షకీల్ సంగీతం గురించి చెప్పాటంటే, 13 ఏళ్ళ వయస్సులోనే ఎస్.పి.బాలు గారిచేత పాటపాడించి ఆశ్చర్యపరిచాడు. గాయత్రీ సురేష్ 68 ఏళ్ళ వ్యక్తిగా నటించింది. అదే సినిమాలో ట్విస్ట్. ఇక ఈ సినిమాలో సీనియర్లు నటించారు. కెమెరా పనితనం బాగుంది. జూలై 8న అందరూ చూసి ఆదరించండి అని తెలిపారు.
సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరికి నివాళి
ఈ సందర్భంగా నిన్న పరమపదించిన సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరికి నివాళిగా రెండు నిముషాలు అందరూ మౌనం పాటించారు. గుడిపూడి శ్రీహరి చేసిన సేవలను జర్నలిస్టు ప్రభు విశ్లేషించారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తమతోపాటు రాబోయే తరం కూడా నిలిచారని కొనియాడారు.
సంగీత దర్శకుడు షకీల్ మాట్లాడుతూ, నేను ఈ స్థాయికి రావడానికి కారణం దర్శక నిర్మాతలు నాకిచ్చిన ప్రోత్సహామే కారణం. ముందుగా శాండీకి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయన లేకపోతే సినిమా వచ్చేదికాదు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
యాక్షన్ గ్రూప్ అధినేత చిత్ర నిర్మాత సుబాని అబ్దుల్ మాట్లాడుతూ, నేను 22 ఏళ్ళుగా పలు వ్యాపారాలు చేస్తున్నాను. నా బ్రదర్‌కూడా చేస్తున్నాడు. అంతా మంచిగా వుండగా సినిమా చేస్తున్నానని అన్నాడు. ధైర్యంగా ప్రోత్సహించాం. ఇంపాసిబుల్‌ను పాసిబుల్ చేసి విడుదలవరకు తీసుకువచ్చాడు. సినిమాను వండర్‌ఫుల్‌గా తీశాడు. మనసారా అభినందిస్తూ హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
యఎస్.కె. ఫిలిమ్స్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, నేను చేసిన ఎన్నో సినిమాలను ఆదరించినట్లే గంధర్వను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. యఎస్.కె. ఫిలిమ్స్ ద్వారా ప్రేమిస్తే, జర్నీ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు విడుదల చేశాం. నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్‌లు వచ్చాయి. పంపిణీదారుడిగా హిట్లు కొట్టాను. శాండీ (సందీప్ మాధవ్) చేసిన వంగవీటి, జార్జిరెడ్డి చూశాను. ఆ సినిమాల తర్వాత ఏ సినిమాలు ఒప్పుకోకుండా హ్యాట్రిక్ కోసం ఆగి ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూసిన వెంటనే డిస్ట్రిబ్యూట్ చేశాను. కథ చాలా కొత్తగా వుంటుంది. నాకు ఈ సినిమా ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఇందులో సాయికుమార్, బాబూమోహన్, సురేష్ వంటి సీనియర్లు నటించారు. గాయత్రీ నటన అద్భుతంగా వుంది. గ్లామర్ డాల్‌గా శీతల్ చేసింది. తెలుగులో ఇంతవరకు రాని కథను నమ్ముకుని అప్సర్ దర్శకత్వం వహించడం హ్యాట్సాప్‌గా అనిపించింది. జూలై 8న విడుదలవుతుంది. చిన్న సినిమాలకు థియేటర్లకు జనాలు రారు అనుకుంటుండగా, మా సినిమాకు ఏషియన్, సురేష్ ప్రొడక్షన్, వరంగల్‌శ్రీను వంటివారు ప్రోత్సాహం మరువలేనిది. మంచి థియేటర్లు ఇచ్చిన గీత ఆర్ట్స్‌వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
గాయత్రీ సురేష్ మాట్లాడుతూ, గందర్వ చేయడం చాలా సంతోషంగా వుంది. సందీప్ ది బెస్ట్ ఇచ్చారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ ఆల్‌ది బెస్ట్ చెబుతున్నా.సాయికుమార్, షకీల్, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ అందరికీ థ్యాంక్స్ తెలిపారు.
శీతల్ మాట్లాడుతూ, ఇది నా మొదటి సినిమా. అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి ధన్యవాదాలు తెలియజేశారు.
నటుడు మధు నంబియార్ మాట్లాడుతూ, ఇంతకుముందు 10 సినిమాలు చేశాను ఇందులో మంచి పాత్ర ఇచ్చి దర్శకుడు ప్రోత్సహించారన్నారు.
ఈ వేడుకలో జబర్‌దస్త్ టీమ్ అవినాష్, నవీన్, రాజమౌళి, సైనిక, అలకనంద, భాను, బాపు, పవిత్ర, బాష, నాగిరెడ్డి. స్కిట్ వేసి అలరించారు.