సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (18:22 IST)

వేక్సిన్ త‌ర్వాత ర‌క్త‌దానం కుద‌ర‌ద‌ని ముందుగానే వ‌స్తున్న దాత‌లు

doners
చిరంజీవి బ్ల‌డ్ బేంక్‌కు ర‌క్త‌దానం ఇచ్చేవారి అభిమానులు పెరుగుతున్నారు. కోవిడ్ వ‌ల్ల టీకా వేసుకున్న త‌ర్వాత దాదాపు నెల‌పాటు ఆ త‌ర్వాత కూడా ర‌క్త‌దానం ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు పెట్టింది. ఇది గ్ర‌హించిన దాత‌లు వేక్సిన్‌కు ముందుగానే జూబ్లీహిల్స్ ద‌గ్గ‌ర‌లోని చిరంజీవి బ్ల‌డ్ బేంక్‌కు వ‌స్తున్నారు. 
 
క‌రోనా క్రైసిస్ కష్ట‌కాలంలో 101 మంది `హ్యాపీ లివింగ్` టీమ్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి ర‌క్త‌దానం చేశారు. అందుకు గాను చిరంజీవి చేతుల మీదుగా హ్యాపీ లివింగ్ ఇంటీరియ‌ర్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు, కంపెనీ ఎండీ శ్రీ‌నుబాబు పుల్లేటిని చిరంజీవి యువ‌త సార‌థ్యంలో స‌త్క‌రించారు.
 
శ్రీనుబాబు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు విచ్చేసి 62 వ సారి రక్తదానం చేశారు. నేటి ఈ స‌న్నివేశంలో మునుముందు ర‌క్త‌దానం కుద‌ర‌ని ప‌రిస్థితి ఉంటుంది. వ్యాక్సినేష‌న్ వేయించిన త‌ర్వాత ర‌క్త‌దానం కుద‌ర‌దు. అందుకే హ్యాపీ లివింగ్ సంస్థ నుంచి 18 మంది స్టాఫ్  రక్తదానం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏడాదిలో 101 మంది ఈ సంస్థ త‌ర‌పున ర‌క్త‌దానం చేశారు. మే 1 నుంచి అంద‌రూ వ్యాక్సినేష‌న్ చేయించుకుంటే ర‌క్త‌దానం కుద‌ర‌ద‌ని త్వ‌ర‌గా అంద‌రూ ర‌క్త‌దాన‌యం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా శ్రీ‌ను బాబు కోరారు. రక్తం దొరక ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే మెగాస్టార్ ఆశయం ప్రకారం తామంతా ర‌క్త‌దానం చేశామ‌ని ఆయ‌న తెలిపారు. శ్రీనుబాబు పుల్లేటి సేవ‌ల‌కు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.