దాంపత్య జీవితం గురించి ఐడియా లేదు.. నచ్చిన వాడు దొరికితే పెళ్లే: టబు
బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న టబు... తనకు అన్ని విధాలా తగిన వరుడి కోసం వేచిచూస్తున్నానని తెలిపింది. ఇన్నాళ్లు పెళ్లి చేసుకునేది లేదని.. ఒంటరిగా వుంటానని చెప్పుకొచ్చిన టబు.. ప్రస్తుతం పెళ్లి చేసుకునేందుకు సుముఖంగా వున్నట్లు తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో తనకు మనసుకు నచ్చిన వాడి కోసం వేచి చూస్తున్నానని 47 ఏళ్ల టబు వెల్లడించింది.
తొలుత పెళ్లి వద్దనుకున్నాను. అందుకు కారణాలున్నాయి. ఇన్నాళ్లు ఒంటరిగా వుండిపోయాను. పెళ్లి కాకపోవడంతో దాంపత్య జీవితం గురించి ఐడియా లేదు. అయితే మనసుకు నచ్చిన వాడిని, తన అభిప్రాయాలను గౌరవించేవాడిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని.. కానీ అందుకోసం చాలాకాలం వేచి చూడాలేమోనని టబు మనసులోని మాటను వెల్లడించింది.
ఇంకా నటుడు ఆయుష్మాన్‌తో కలిసి ఓ సినిమాలో నటించిన టబు.. ఆయుష్మాన్ తండ్రి జ్యోతిష్యుడని తెలిసి ఆశ్చర్యపోయిందట. ఇంకా ఆయుష్మాన్ తండ్రి జ్యోతిష్యుడని తెలిసివుంటే తన జాతకాన్ని చూపెట్టేదానినని.. అలా చేస్తే పెళ్లైపోతుందో లేదో తేలిపోతుంది కదా అంటూ చెప్పిందట. దీనిని బట్టి టబు పెళ్లి పట్ల ఆసక్తిగా వుందని త్వరలో ఆమె మనసుకు నచ్చిన వరుడితో పెళ్లి కుదరవచ్చునని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.