బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (15:20 IST)

''ఫౌజీ''లో ఇద్దరమ్మాయిలతో ప్రభాస్ రొమాన్స్?

prabhas
ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ హిస్టారికల్ ఫిక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. పాన్-ఇండియన్ చిత్రం గత నెలలో లాంచ్ వేడుక జరిగింది. ఈ సినిమాలో సోషల్ మీడియా స్టార్ ఇమాన్విని మెయిన్ హీరోయిన్‌గా మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు కూడా ఆమె హాజరయ్యారు. అయితే ఈ సినిమా ఇద్దరు హీరోల కథ అని తెలిపింది. దీంతో ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నారని టాక్ వస్తోంది. 
 
కథలో ఒక భాగంలో ఇమాన్వి కనిపిస్తే, అదే సినిమాలోని మరో భాగంలో మరో హీరోయిన్ కనిపిస్తుంది. మేకర్స్ సెకండ్ హీరోయిన్‌ని కూడా ఎంచుకున్నారు. ఆమె ఎవరనేది ఇంకా తెలియరాలేదు.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ దేశభక్తి డ్రామాను నిర్మిస్తోంది. "ఫౌజీ" అనేది ఈ సినిమాకు టైటిల్ అని తెలుస్తోంది.