శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (13:56 IST)

రెండు ఆత్మల మధ్య జరిగే ప్రయాణమే టు సోల్స్

Trinath Varma, Bhavana Sagi
Trinath Varma, Bhavana Sagi
రెండు ఆత్మల మధ్య జరిగే ప్రయాణాన్ని సగటు ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ అనిపించేలా తెరకెక్కించారని ట్రైలర్ చెపుతుంది. దర్శకుడు శ్రావణ్ ఓ సరికొత్త ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టు సోల్స్ అనే డిఫరెంట్ టైటిల్ తో తన దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమాను విడుదల చేయబోతున్నారు. 
 
పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 21వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టు సోల్స్ టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వెండితెరపై ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ చూడొచ్చు అనే ఫీలింగ్స్ తీసుకొచ్చాయి. అలా  ఈ మూవీపై ఆడియన్స్ దృష్టిపడేలా చేసి రిలీజ్ చేస్తున్నారు. 
 
ఈ సినిమాలో త్రినాథ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లుగా నటించారు. రవితేజ మహదాస్యం, మౌమిక రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మనకు ఎదురయ్యే ఏ పరిచయం కూడా యాదృచ్ఛికం కాదు అనే కథా నేపథ్యంతో గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికర ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందించారని టీజర్, ట్రైలర్ స్పష్టం చేశాయి.