Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ
In a warrior look Rashmika
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
ఇవాళ రశ్మిక మందన్న బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి విశెస్ చెబుతూ కొత్త పోస్టర్, టీజర్ సాంగ్ 'రేయి లోలోతుల' రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రశ్మిక వారియర్ లుక్ లో గన్, కత్తితో పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. 'రేయి లోలోతుల' పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు.
ఈ పాటలో వచ్చే పోయెమ్ ను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాశారు. 'రేయి లోలోతుల' పాట ఎలా ఉందో చూస్తే - 'రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్సి నిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్, సంగీతం - హేషమ్ అబ్దుల్ వాహబ్
రచన -దర్శకత్వం - రాహుల్ రవీంద్రన్