ఆర్.ఆర్.ఆర్.లో గొప్ప సీక్రెట్ విడుదల చేసిన విజయేంద్రప్రసాద్
NTR, charan, Vijayendra Prasad
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న `ఆర్.ఆర్.ఆర్.` గురించి ఏదో ఒక వార్త వస్తూనే వుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులు పెన్ స్టూడియో దక్కించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్.లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమా భారత్‌లోని ఐదు భాషలలో విడుదలకావడం ఒక భాగమైతే, ప్రపంచవ్యాప్తంగా కలిపి 13 భాషల్లో విడుదలకాబోతుంది. ఇందుకు రాజమౌళి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు. ఇదొక లేటెస్ట్ అప్‌డేట్. అంతకంటే మరో అప్‌డేట్ వుంది.
ఆర్.ఆర్.ఆర్.లోని తాజా సీక్రెట్‌ను కథా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ బయటపెట్టారు. రామ్‌చరన్, ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారు దేశం కోసం పోరాడిన పోరాట యోధులు అదీ తెలిసిందే. ఇద్దరు ఒకే కాలానికి చెందిన వారు కాదు. అలాంటి వారిని కలిపి ఎవరిపై యుద్ధం ప్రకటిస్తారనేది సినిమాలో సస్పెన్స్. అయితే అలా పోరాడే క్రమంలో ఒకరిపై ఒకరు పోరాడుకుంటారు. వారి మధ్య వార్ మామూలుగా వుండదు. హాలీవుడ్ స్థాయిలో వుంటుంది. కొన్ని హాలీవుడ్ సినిమాల యాక్షన్ పార్ట్‌ను మైమరిపించేలా చేస్తుంది.
బాహుబలిలో కూడా ప్రభాస్, రానా ఇద్దరూ సమ ఉజ్జీలుగా పోరాడే సన్నివేశం ఆసక్తికరంగా రాజమౌళి తెరకెక్కించాడు. ఆర్.ఆర్.ఆర్.లో కూడా అంతకుమించి ఎన్.టి.ఆర్, రామ్‌చరణ్‌లు పోరాడుకుంటారు. అది కూడా ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తుంది. ఒక దశలో జాలేస్తుంది. ఏడుపు కూడా వస్తుందట. అందుకే పోరాటాన్ని కొద్దిగా తగ్గించాల్సి వచ్చిందని చూసే ప్రేక్షకుడికి కన్నారప్పకుండా చూసేలా వుంటుందని కథా రచయిత విజయేంద్రప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బహిరంగ పరిచారు. మరి ఏమిటి? ఎందుకు? ఎలా? అనేది తెలియాలంటే పరిస్థితులు అనుకూలిస్తే విజయదశమికి సినిమాను చూడొచ్చు.