శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మే 2021 (10:51 IST)

'ఆర్ఆర్ఆర్' శాటిలైట్ రైట్స్ జీ గ్రూప్ సొంతం.. బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తయ్యింది. 
 
ఈ సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్‌తో పాటుగా డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని పెన్ స్టూడియోస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇటీవలే 10 భాషల మూవీ హక్కులను అమ్మేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలకి చెందిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకుంది.
 
అలానే దక్షిణాది భాషల శాటిలైట్ రైట్స్ స్టార్ గ్రూప్ వారు చేజిక్కించుకోగా.. హిందీ శాటిలైట్ ‘జీ సినిమా’ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి జీ5 బ్యాడ్ సెంటిమెంట్‌గా మారుతుందేమో అని సినీ అభిమానులు భయపడుతున్నారు.
 
జీ గ్రూప్ వారు సొంతం చేసుకున్న సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాపులుగానే మిగిలాయి. స్పైడ‌ర్, రాధే వంటి చిత్రాలు జీ గ్రూపు వారు కొన‌గా, ఇప్పుడు ఆర్ఆర్‌ని కూడా సొంతం చేసుకున్నారు. మరి దర్శకధీరుడి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ముందు జీ5 బ్యాడ్ సెంటిమెంట్ తుడిచిపెట్టుకుపోతుందేమో చూడాలి.