గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (14:40 IST)

మౌన పోరాటం త‌ర్వాత మంచి షెడ్ ఉన్న క్యారెక్టర్ స్ట్రీట్ లైట్ లో చేశాః వినోద్ కుమార్

Vinodkumar, mamidala and others
పగలంతా పెద్దమనుషులుగా చలామణి రాత్రి అయ్యేసరికి  క్రిమినల్ థాట్స్ గా మారే క‌థాంశంతో స్ట్రీట్ లైట్ సినిమా రూపొందింది. వినోద్ కుమార్ ప్ర‌ధాన పాత్ర పోషించగా, తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి ఇత‌ర పాత్ర‌లు పోషించారు. మామిడాల శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి విశ్వ ద‌ర్శ‌కుడు. తెలుగు, హిందీ భాష‌ల్లో త్వ‌ర‌లో థియేట‌ర్‌లో విడుద‌ల‌కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.
 
వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నేను చేసిన మొదటి చిత్రం మౌన పోరాటంలో నేనే హీరో,నేనే విలన్. ఇన్ని రోజుల తరువాత మళ్ళి ఇప్పుడు అటువంటి మంచి షెడ్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాతో లభించింది. స్ట్రీట్ లైట్ సినిమా చాలా హాట్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పగలంతా ఎంతో పెద్దమనుషులు రాత్రి అయ్యేసరికి  క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి.వారు  ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడు కుంటున్నారో అనేది క‌థ‌. అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం ‘రివెంజ్ డ్రామా’ ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా ఒకే ప్లేస్ లో ఒకే స్ట్రీట్ లైట్ కింద ఎం జరిగింది అనేది దర్శకుడు చాలా చక్కగా తీశాడు. గత 35 సంవత్సరాలుగా నేను మౌన పోరాటం నుండీ ఇప్పటివరకూ నేను 150 సినిమాలలో నటించడం జరిగింది. మళ్ళి ఇప్పుడు బుల్లెట్ సత్యం సినిమాతో మళ్ళి సినిమాలు చేస్తున్నాను. చాలా రోజుల తరువాత నేను చేస్తున్న మంచి సినిమా ఇది.ఇలాంటి మంచి సినిమాలో నటించె ఆ అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.
 
చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో కాకుండా థియేటర్స్ లో ఈ నెల విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగు, హిందీ రెండు బాషల్లో విడుదల చేస్తున్నాము.హిందీ లో స్ట్రెయిట్ సినిమా గా సెన్సార్ వచ్చింది. సెన్సార్ వారు ఈ సినిమా చూసి ఇది చాలా గ్లామర్  సినిమా అని మెచ్చుకొని ఒక్క కట్ కూడా చేయకుండా సెన్సార్ ఇచ్చారని అన్నారు.
 
నిర్మాత ప్రసన్న కుమార్ . మాట్లాడుతూ,  సత్యజిత్ రే ఇనిస్టిట్యూట్ నుండి వచ్చిన రవి కుమార్ ఈ సినిమాకు అద్భుతమైన కెమెరా ఇచ్చాడు..ఇందులో అందరూ కూడా  డెడికేటెడ్ గా వర్క్ చేశారు. అన్ని ఎమోషన్స్ తో కూడుకున్న "స్ట్రీట్ లైట్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆడియన్స్ ఎం కావాలో తెలిసిన తను అన్ని భాషలకు పనికొచ్చే విధంగా తీసిన ఈ స్ట్రీట్ లైట్ సినిమా  మామిడాల కు గొప్ప విజయం సాధించాలని అన్నారు..
 
చిత్ర దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ, నిర్మాతకు స్ట్రీట్ లైట్ కాన్సెప్ట్ చెప్పినపుడు మేమంతా స్ట్రీట్ లైట్ కింద ఉన్న చిన్న ప్లేస్ లో 2 గంటల సినిమాను కాంపాక్ట్ గా ఎలా తీయాలి అని డిస్కషన్ చేసుకుని స్టార్ట్ చేశాము. ఆ స్ట్రీట్ లైట్ కు రెండు కళ్ళు వినోద్ కుమార్, తాన్యా దేశాయ్ అయితే.ఆ కళ్ళ ను తెరిపించిన వారు కెమెరామెన్ రవికుమార్. థియేటర్స్ బాగుండాలనే ఉద్దేశ్యంతో థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము అన్నారు.
ఇంకా బెక్కెం వేణుగోపాల్‌, రామసత్యనారాయణ మాట్లాడుతూ, స్ట్రీట్ లైట్ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు.