షూటింగ్‌లో గాయపడిన హీరో విశాల్  
                                       
                  
                  				  కోలీవుడ్ హీరో  విశాల్ మరోమారు షూటింగులో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నాట్ ఏ కామన్ మ్యాన్ సినిమాలో నటిస్తున్నాడు. తూపా.శరవణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 
				  											
																													
									  
	 
	యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న సమయంలో ఆయన గోడను ఢీకొని పడిపోవడంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ఆయనకు వెంటనే వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సినిమా బృందం తెలిపింది. 
				  
	 
	ఇదే సినిమా షూటింగ్‌లో గతంలోనూ విశాల్ గాయాలపాలయ్యాడు. అప్పట్లో ఆయన తల, కంటికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ ఘటన మరవకముందే ఆయన మరోసారి గాయాలపాలవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.