శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (22:21 IST)

కమలం వైపు విశాల్ చూపు, వాళ్ళు వద్దంటున్నారా?

సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం షరామామూలే. కొంతమంది రాజకీయాల్లోనే కొనసాగితే మరికొంతమంది మాత్రం తిరిగి సినీపరిశ్రమకే వెళ్ళిపోతుంటారు. అయితే కరోనా సమయంలో సినీప్రముఖులు ఇంటి పట్టునే ఉండడంతో ఎవరూ రాజకీయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు.
 
కానీ తాజాగా సినీనటుడు విశాల్ బిజెపి వైపు చూస్తున్నారట. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో ఆయన బిజెపిలో చేరాలన్న నిర్ణయానికి వచ్చేశారట. ప్రధానంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ప్రశంసిస్తూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. 
 
దీంతో బిజెపికి దగ్గరవ్వడానికే విశాల్ ఇదంతా చేస్తున్నారంటూ అభిమానులు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే చాలామంది అభిమానులు రాజకీయాల్లోకి రావద్దంటూ సందేశాలు కూడా పంపిస్తున్నారట. ఈ నేపథ్యంలో విశాల్ మేనేజర్ హరిక్రిష్ణన్ ఒక ప్రకటన విడుదల చేశారట.
 
ఇప్పట్లో విశాల్ రాజకీయాల్లోకి రారని, అసలు బిజెపిలో చేరే ఆలోచనలో లేదని..కంగనా చేసిన పనిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారే తప్ప బిజెపి మెప్పు పొందేందుకు ఏ మాత్రం కాదంటన్నారట హరిక్రిష్ణన్.