మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 24 అక్టోబరు 2018 (11:57 IST)

'పందెంకోడి 3'కి విశాల్ ప్లాన్స్...

మాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పందెంకోడి 2'. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదలై సూపర్‌ ఓపెనింగ్స్‌తో సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. 6 కోట్లకు కొన్న 'పందెంకోడి 2'.. 5 రోజులకే 5 కోట్ల 63 లక్షలకు పైగా షేర్‌ సాధించి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. 
 
ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ ''పందెం కోడి చిత్రం నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్‌ మూవీ. నేనెక్కడికి వెళ్ళినా అందరూ పందెం కోడి.. అని పిలిచేవారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ చెయ్యాలనుకున్నప్పుడు ఆ సినిమా రేంజ్‌లో చెయ్యగలమా అనే ఒక టెన్షన్‌ ఉండేది. అందువల్లే పందెంకోడి 2 చెయ్యడానికి 13 ఏళ్ళు పట్టింది. నేను, లింగుస్వామి కథను నమ్మి ఈ సినిమా చేశాం. లింగుస్వామి ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ప్రేక్షకులు ఈ సినిమాను మేం ఊహించిన దానికంటే పెద్ద హిట్‌ చేశారు. 
 
యాక్షన్‌తోపాటు ఎమోషన్‌ కూడా బాగా పండింది. నాకు ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చింది. నిర్మాతగా కూడా మంచి విజయాన్ని ఇచ్చింది. 'మహానటి' తర్వాత కీర్తి సురేష్‌ ఈ సినిమాలో కాంట్రాస్ట్‌గా ఉండే ఓ డిఫరెంట్‌ రోల్‌ చేసింది. తన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే విలన్‌గా నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సినిమాకి మంచి గ్రిప్‌ తీసుకొచ్చింది. యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్‌ కూడా ఈ సినిమాని పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లింది. ఈ విజయం స్ఫూర్తితో 'పందెంకోడి 3'ని ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ''మహానటి' వంటి క్లాసిక్‌ మూవీ తర్వాత ఒక మంచి మాస్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేశాను. ఈ క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడే థ్రిల్‌ అనిపించింది. రిలీజ్‌ అయ్యాక నా పెర్‌ఫార్మెన్స్‌ని అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం చాలా ఆనందం కలిగించింది. 'పందెం కోడి 2' అనేది నా కెరీర్‌లో ఓ స్పెషల్‌ మూవీ అయింది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు. 
 
లింగుస్వామి మాట్లాడుతూ ''పందెంకోడి' కంటే పందెంకోడి 2'కి రెస్పాన్స్‌ టెరిఫిక్‌గా ఉంది. ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ సినిమా కంటే పెద్ద రేంజ్‌లో 'పందెంకోడి 3' ఉండేలా స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''ఇంతటి మంచి హిట్‌ సినిమాని మాకు అందించిన విశాల్‌కి, లింగుస్వామికి, ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ దసరా పండగకు మా సంస్థకు మంచి విజయాన్ని అందించిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.