గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (17:38 IST)

తెలుగు వాళ్లందరికీ చెప్తున్నాను.. చిన్మయి

లైంగిక ఆరోపణలపై విచారణ కమిటీ వేస్తున్నట్లు నడిగర్ సంఘం కార్యదర్శి హీరో విశాల్ ప్రకటించడంపై ప్రముఖ నటి శ్రీప్రియ హర్షం వ్యక్తం చేశారు.

లైంగిక ఆరోపణలపై విచారణ కమిటీ వేస్తున్నట్లు నడిగర్ సంఘం కార్యదర్శి హీరో విశాల్ ప్రకటించడంపై ప్రముఖ నటి శ్రీప్రియ హర్షం వ్యక్తం చేశారు. తమిళ సినీ రచయిత వైరముత్తు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని గాయని చిన్మయి ఆరోపించిన నేపథ్యంలో.. చిన్మయికి శ్రీప్రియ అండగా నిలిచింది. చిన్మయి చాలా బాధ్యత గల అమ్మాయి అని.. చిన్మయి చేసే ఆరోపణల్లో నిజం ఉండొచ్చునని శ్రీప్రియ తెలిపారు. 
 
సినీ రంగంలో లైంగిక వేధింపులు ఉన్నాయని... వేధింపులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శ్రీప్రియ డిమాండ్ చేసింది. మరో నటి కస్తూరి మీ టూపై స్పందిస్తూ, అన్ని రంగాల్లోనూ లైంగిక వేధింపులు ఉన్నాయని తెలిపింది. ఈ విషయంలో మహిళలకు న్యాయం జరగాలని కోరింది. మీటూ ఉద్యమంతో మహిళలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకుందని వెల్లడించింది. 
 
అలాగే తెలుగు వాళ్ల అందరికీ చెప్తున్నాను. సుచీలీక్స్ సందర్భంగా తనకు నాలుగు సార్లు అబార్షన్ అయినట్లు వచ్చిన వార్తలన్నీ అసత్యమని చిన్మయి ఓ వీడియోలో చెప్పింది. తనపై తెలుగు ఫ్యాన్స్ నుంచి అభ్యంతరకరమైన మాటలు వాడుతున్నారని.. సుచీలీక్స్ గురించి సుచిత్ర భర్త కార్తీక్ స్పష్టంగా మెయిల్ చేశారని ఆ మెయిల్‌ను ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశానని స్పష్టం చేసింది. సుచిత్ర మానసికంగా సరిగ్గా లేనప్పుడు చేసిన లీక్స్ అవి ఆమె భర్త కార్తీక్ చెప్పారని చిన్మయి గుర్తు చేశారు.