బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:49 IST)

త్వరలోనే ప్రభాస్ పెళ్లి... స్పష్టత ఇచ్చిన పెద్దమ్మ శ్యామలాదేవి

prabhas
టాలీవుడ్ అగ్రనటుడు, మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ పెళ్ళిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి వెల్లడించారు. ఆమె మంగళవారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అందరూ ఎదురు చూస్తున్న రోజు త్వరలోనే రానుందని వెల్లడించారు. 
 
అమ్మవారి ఆశీస్సులతో పాటు పై నుంచి కృష్ణంరాజు దీవెనలు కూడా ప్రభాస్‌పై ఎప్పటికీ ఉంటాయని తెలిపారు. ప్రభాస్‌ పెళ్లిపై ఆమె క్లారిటీతో అభిమానుల ఆనందానికి హద్దే లేకండా పోయింది. కాబోయే వదిన ఎవరో అంటూ అపుడే సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు. 
 
కాగా, ప్రభాస్ "కల్కి 2898 ఏడీ" చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సీక్వెల్‌రానుండగా, ప్రస్తుతం ప్రభాస్ "రాజాసాబ్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకురానుంది.