ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (18:46 IST)

#RRRతో రామ్ చరణ్ కొత్త రికార్డ్.. ఏంటదో తెలుసా?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ట్రిపుల్ ఆర్. లాక్ డౌన్ వలన వాయిదా పడిన ఈ సినిమా తాజాగా మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  
 
ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రహీరోలు చెర్రీ, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.
 
ఇదిలా ఉంటే, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చి నెలలో రిలీజ్ చేసిన 'భీమ్‌ ఫర్‌ రామరాజు' యూట్యుబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ వాయిస్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. 
 
మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్‌కి వీపరితమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మంది చూశారు. దీనితో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా 'భీమ్‌ ఫర్‌ రామరాజు' రికార్డు సృష్టించింది. అటు కొమరం భీమ్ టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.