శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (15:59 IST)

రాజమౌళికి లొంగిపోయాను.. ఆర్ఆర్ఆర్ విలన్ ఎడ్వర్డ్

Edward Sonnenblick
ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి పనిచేయడం, అతని దార్శనికతకు తాను లొంగిపోవాల్సి వచ్చిందని ఆర్ఆర్ఆర్ విలన్ ఎడ్వర్డ్ సోన్నెన్బిక్స్ తెలిపారు. అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సొన్నెన్ బ్లిక్ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడాడు. 
 
"రాజమౌళి సర్ వంటి దర్శకుడి కింద పనిచేస్తూ, భారతదేశపు అతిపెద్ద సూపర్ స్టార్లతో కలిసి నటించడం సంతోషంగా వుంది.   ఆర్.ఆర్.ఆర్ యొక్క స్టార్-స్టాండెడ్ సూపర్ అన్నారు. ముంబై లాంచ్ ఈవెంట్‌లో ఎడ్వర్డ్ మాట్లాడుతూ.. "రాజమౌళి సర్ తో కలిసి పనిచేయడం సరికొత్త అనుభవం. అతని కళానైపుణ్యానికి లొంగిపోవాల్సి వచ్చింది. నాలోని నటనకు ఇది కొత్త స్పిరిట్ అని తెలిపాడు. 
 
ఆర్.ఆర్.ఆర్.లో తన పాత్ర విషయానికొస్తే, ఎడ్వర్డ్ ఈ సమయంలో తాను పెద్దగా వెల్లడించలేనని వివరించాడు, "అయితే, నేను బ్రిటిష్ వలస అధికారిగా విలన్‌గా నటించానని మీకు చెప్పగలను, మరియు దీనిని ప్రేక్షకులతో పంచుకోవడానికి నేను వేచి ఉండలేను." అని చెప్పాడు.