బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:24 IST)

కేజీఎఫ్ 3 ఇదే.. ఫోటోస్ వైరల్

KGF3
KGF3
కేజీఎఫ్ 2 తర్వాత నటుడు యష్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. కేజీఎఫ్ 3 వుంటుందని టాక్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడలో చిత్రీకరించి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో డబ్ చేసిన కేజీఎఫ్ -1కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది.
 
ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 థియేటర్స్ ద్వారా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పటి నుంచి 'పాన్ ఇండియా' స్టార్ అయ్యాడు యష్. 
 
తాజాగా టీమిండియా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా యష్ తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హార్దిక్ ఈ ఫోటోకు "కెజిఎఫ్ 3" అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.