గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జులై 2022 (15:28 IST)

'యశోద' అప్డేట్.. టాకీ పార్ట్ ఓవర్

Samantha,
టాలీవుడ్ హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషిస్తున్న 'యశోద' చిత్రం షూటింగ్‌ ఒక పాట మినహా టాకీ మొత్తం పూర్తయింది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై హరి-హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. వంద రోజుల్లో షూటింగ్ పూర్తయ్యింది. ఒకవైపు గ్రాఫిక్స్‌ పని జరుగుతుండగా ఈ నెల 15 నుంచి డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. 
 
ప్రస్తుత మార్కెట్‌ దృష్ట్యా ప్యాన్‌ ఇండియా చిత్రంగా విడుదల చేయడానికి పూర్తిగా సిద్థమాయ్యాకే మంచి తేదీ చూసుకుని విడుదల తేదీని ప్రకటిస్తారు. 
 
సీట్‌ ఎడ్జ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్థం చేస్తున్నారు. 
 
సమంత, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, శత్రు, కల్పికా గణేష్‌, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మీ, లైన్‌ ప్రొడ్యూసర్‌: విద్య శివలెంక