సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (12:39 IST)

విజయసాయిరెడ్డి 'తగ్గేదేలే' ట్యాగ్‌లైన్.. వారికి చిచ్చు పెట్టేందుకేనా?

vijayasaireddy
ప్రతిపక్ష నాయకులపై విమర్శలు గుప్పించే ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తుతం సినిమా రంగంపై పడ్డారు. ఇటీవల సైమా అవార్డ్స్ దక్కించుకున్న తెలుగు సినిమా 'పుష్ప' సినిమాపై తన ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. తన నటనతో తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌కు అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా 'తగ్గేదేలే' అన్న ట్యాగ్‌లైన్ కూడా తగిలించారు. 
 
అయితే విజయసాయిరెడ్డి తాజా ట్విట్ చర్చనీయాంశమైంది. ఇది ముమ్మాటికీ మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడానికేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మెగాస్టార్ రాజకీయాలను పక్కన పెట్టి తన పనితాను చేసుకుంటున్నారు. 
 
మిగతా మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన యువ హీరోలు సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు. మరోవైపు అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో చిచ్చు రగిల్చిందుకే విజయసాయిరెడ్డి కొత్త ఎత్తుగడ అనే కామెంట్స్ అయితే మాత్రం అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
 
పుష్ప సినిమా విడుదల సమయంలో టిక్కెట్ల రచ్చ ఉంది. ఏపీ ప్రభుత్వం అదే సమయంలో ఆన్ లైన్ టిక్కెట్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. అయినా చిత్ర యూనిట్ డేరింగ్ చేసి సినిమాను రిలీజ్ చేసింది. సినిమా బంపర్ హిట్ అయ్యింది. 
 
పాన్ ఇండియా స్థాయిలో మంచి చిత్రంగా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం పుష్పపై విజయసాయిరెడ్డి సానుకూలంగా స్పందించడంపై రకరకాలుగా చర్చ సాగుతోంది.