గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (13:12 IST)

రుహాని శర్మ (హెచ్‌.ఇ.ఆర్‌.) హర్ మూవీ ఎలా వుందంటే.. రివ్యూ

Ruhani Sharma,  Vikas Vashishta
Ruhani Sharma, Vikas Vashishta
హీరోయిన్ రుహాణి శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా HER. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న రుహాణి.. ఇప్పుడు మరో డిఫరెంట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. 
 
ఈ వారం అగ్రహీరోల సినిమాలు ఏకపోవడంతో పలు చిన్న, మధ్యస్థాయి సినిమాలు విడుదలయ్యాయి. అందులో హర్‌ సినిమా ఒకటి. చి.ల.సౌ. సినిమానే నటించిన రుహాని శర్మ ఇందులో ప్రధానమైన పాత్ర పోషించింది. ఆరోజే విదుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
నగరంలో పలు హత్యలు జరుగుతుంటాయి. వాటి వెనుక కారణాలన్ని తేల్చేందుకు ఎ.సి.పి. అర్చనా ప్రసాద్‌ (రుహానీ శర్మ) రంగంలోకి దిగుతుంది. అందులో భాగంగా కేశవ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా తన ప్రియుడు శేషాద్రి (వికాస్‌ వశిష్ట)ను పోగొట్టుకుంటుంది. దాంతో ఆరునెలలు సస్పెన్షన్‌కు గురవుతుంది. ఆ తర్వాత తిరిగి డ్యూటీలోకి జాయిన్‌ కాగానే మరో రెండు హత్యలు జరుగుతాయి. అవి శోధించే క్రమంలో కేశవ్‌కు ఆ హత్యలకు లింక్‌ దొరుకుతుంది. ఆ తర్వాత ఎటువంటి సవాళ్ళు ఆమెకు ఎదురయ్యాయి? అనేవి మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
హత్యలు, నేరాలు చేసే వారిని పట్టుకునేందుకు చేసే ప్రయత్నాల్లో పలు సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా నేరస్తులు ఇప్పటి టెక్నాలజీని అందిపుచ్చుకుని పోలీసులకు దొరక్కుండా ఏవిధంగా తప్పించుకుంటున్నారు. వారిని ఏవిధంగా డైవర్ట్‌ చేస్తున్నారనే కథలు వస్తున్నాయి. అలా ఆసక్తికగా సాగే కథతో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా చూస్తుంటే గతంలో హిట్‌ అనే సినిమా గుర్తుకు రాకమానదు. దర్శకుడు మొదట్లోనే కథలోకి ఇన్‌వాల్వ్‌ అయ్యేలా కథ రాసుకున్నాడు. కానీ ఆ తర్వాత కొంచెం కథ ఎటో ఎళుతుందనే భ్రమ కలుగుతుంది. ఇప్పటి టెక్నాలజీ ప్రకారం సీసీ కెమెరాలు వగైరాలతో ఛేదించే దానికి కొంత గందరగోళంగా సీన్లు వుంటాయి. 
 
నేరస్తులు పూర్తి అవగాహనతో వున్నారు. వారిని దాటి పోలీసుల మైండ్‌ సెట్‌ వుండాలి. ఆ దిశగా కథను రాసుకుంటే మరింత ఆకట్టుకునేది. ఓ పోలీసు అధికారి రెండు కేసుల్ని పరిధోదించే క్రమంలో ఒకదానితో మరొకటి లింక్‌ పెట్టే విధానం ఆకట్టుకుంటుంది. కొన్నిచోట్ల బోర్‌ కొట్టకుండా చేశాడు. ప్రథమార్థంలో పాత్రల పరిచయం కోసం టైం సరిపోతుంది. ఇంటర్‌వెల్‌ మలుపు బాగుంది. ముగింపు అనేది ఊహించని ట్విస్ట్‌గా వుంటే బాగుండేది. ఇలాంటి కథలకు రిరికార్డింగ్‌ కీలకం. దానిలో కృషి కనిపిస్తుంది. ఈ సినిమా నిడివి తక్కువ. పరిమితంగా తీసిన ఈసినిమా నిర్మాణ విలువలు ఓకే. 
 
ఇందులో పోలీసు పాత్రలో రుహాని ఒదిగిపోయింది. వశిష్టతో సాగే సన్నివేశాలు అలరిస్తాయి. జీవన్‌ కుమార్‌ నటనతో మెప్పించాడు. సంజయ్‌ స్వరూప్‌, బెనర్జీ, చిత్రంశ్రీను తదితరులు పాత్రలమేరకు నటించారు. దర్శకుడు కథను మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. మేకింగ్‌ బాగా తీశాడు. కొన్ని ట్విస్ట్‌లు మెప్పించాడు. మరింత కొత్తదనంతో తీస్తే బాగుండేది. సస్పెన్స్‌ థ్రిల్‌ సినిమాలు చూసేవారికి ఇది ఆకట్టుకుంటుంది.
రేటింగ్‌: 2.75/5