శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (12:57 IST)

మాచర్ల నియోజక వర్గం మినీ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ ఖాతాలో హిట్ పడ్డట్టేనా?

Nithin, Kriti Shetty
ఫ్యాక్షన్ స్టోరీతో నితిన్ నటించిన సినిమానే మాచర్ల నియోజక వర్గం. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్‌లుగా న‌టించిన‌ సినిమా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. 
 
ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈసినిమాను తెర‌కెక్కించారు. ఎప్పుడూ లవ్ స్టోరీస్ లేదంటే ప్యామిలీ స్టోరీస్‌తో సందడి చేసే నితిన్, ఈసారి కంప్లీట్‌గా తన జానర్ మార్చేసి.. కంప్లీట్ యాక్ష‌న్ రోల్‌ను పోషించాడు.  
 
ఫస్ట్ హాఫ్ సినిమా పై ట్విట్టర్ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. మొదటి భాగం సినిమా యావరేజ్‌గా ఉంది. అందులో గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటే వెన్నెల కిషోర్ కామెడి మాత్రమే చూడదగినది అంటున్నారు. 
 
అంతే కాదు సినిమాకు సెకండ్ హాఫ్ ప్రాణం పోస్తేనే ఈసినిమా నిలబడే అవకాశం ఉంది అంటున్నారు. నీడ్ బిగ్ సెకండ్ హాఫ్ అని కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఫస్ట్ హాఫ్ మూవీపైన అందరివి ఒకేరకమైన రివ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ పూర్‌గా ఉంది. వెన్నెల కిషోర్ పెర్ఫామెన్స్ మాత్రమే ఫస్ట్ హాఫ్‌కు ప్లస్.. మిగతా అంతా డల్ అయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి నితిన్‌కు సక్సెస్ హోప్ వచ్చినట్టే అని ట్వీట్ చేస్తున్నారు. 
Nithin, Kriti Shetty, Catherine Theresa, Anjali  and others
Nithin, Kriti Shetty, Catherine Theresa, Anjali and others
 
అభిమానులు మాత్రం సినిమా ఫష్ట్ హాఫ్ మంటలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ బాగాలేకపోయినా.. సెకండ్ హాఫ్ సూపర్ డూపర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు ఆడియన్స్.