శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (15:13 IST)

థ్రిల్ క‌లిగించే రోజ్ విల్లా

Rose villa still
రోజ్ విల్లా పేరుతోపాటు పోస్ట‌ర్‌ను చూడ‌గానే ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా అని అర్థ‌మ‌వుతుంది. క‌న్న‌డ `దియా` ఫేమ్ దీక్షిత్ శెట్టి న‌టించిన సినిమా రోజ్‌విల్లా. రాజా ర‌వీంద్ర కూడా ఇందులో  న‌టించారు. నిర్మాత: అచ్యుత్ రామారావు పి, చిత్ర మందిర్ స్టూడియోస్ బేన‌ర్‌పై నిర్మించిన ఈ సినిమా  అక్టోబ‌ర్ 1నే విడుద‌లైంది. హేమంత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌లైంది. మ‌రి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
క‌థ‌.
ఓ యువ జంట. డాక్ట‌ర్ ర‌వి (దీక్షిత్ సెట్టి), శ్వేత (శ్వేత వ‌ర్మ) తాము కోరుకున్న‌విధంగా మున్నార్ అనే అంద‌మైన ప్రాంతానికి కారులో వ‌స్తారు. ప్ర‌కృతి కోన‌లు అందంగా వున్న ఆ దారిలో న‌గ్జ‌ల్స్ వున్న డేంజ‌ర్ పాయింట్‌కు వ‌స్తారు. అక్క‌డే వారి కారు బ్రేక్ డౌన్ అవుతుంది. అటుగా వ‌చ్చిన పోలీసులు వారిని సుర‌క్షితంగా ఊరిలో దిగ‌బెడ‌తారు. అక్క‌డ రెస్టారెంట్‌లో వీరు తింటుండ‌గా మిల‌ట్రీ రిటైర్ అయిన సోల్‌మాన్ (రాజా ర‌వీంద్ర) త‌న భార్య హెలెన్‌తో (అర్చ‌నా కుమార్‌) తో అక్క‌డే వుంటాడు. సోల్‌మాన్ తింటుండ‌గా పొల‌మారుతుంటే డా. ర‌వి చిన్న చిట్కా చెప్పి సేవ్ చేస్తాడు. అలా త‌న‌ను కాపాడినందుకు త‌న ఇంటిలో రేపు ఏనివ‌ర్స‌రీ కావ‌డంతో ఆతిథ్యం తీసుకోమ‌ని బ‌లంతం పెడ‌తారు. అలా వెళ్ళిన ఈ యువ‌జంట‌కు అక్క‌డి వాతావ‌ర‌ణం వితంగానూ భ‌యంక‌లిగించేదిగా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించింది? అప్పుడు ఈ యువ‌జంట ఏం చేశారు? ఆ త‌ర్వాత ఏమ‌యింది? అనేది మిగిలిన క‌థ‌.
 
విశ్లేష‌ణః
 
ర్శకుడు హేమంత్ ఒక సాధారణ క‌థ‌ను భావోద్వేగ కథతో ఆవిష్క‌రించాడు. అది చూసే వీక్షకులను థ్రిల్ చేయడానికి ప్రయత్నించారు. కథనం ఆసక్తికరంగా  మొదలవుతుంది  డైలాగ్‌లు భావోద్వేగాలతో నిండి ఉన్నాయి. అర్చన, రాజా రవీంద్ర అసాధారణ ప్రవర్తనతో ఆసక్తి పెరుగుతుంది, కానీ కొంత సమయం తర్వాత, పునరావృతమయ్యే దృశ్యాలు ప్రవేశిస్తాయి  ఇవ‌న్నీ యువ జంట‌కు ఆశ్చ‌ర్యంగానూ వుంటాయి. దీక్షిత్‌ను చూసి త‌న కొడుకు అనుకుని ఇక్క‌డే వుండ‌మ‌ని బ‌ల‌వంతం చేయ‌డంతో త‌ను ఉండ‌న‌డ‌డం ఆ త‌ర్వాత జ‌రిగే సంఘ‌ట‌న‌లు సినిమాల‌కు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. చూసేవారికి ఉత్సుకత పెంచుతాయి. మరికొన్ని మలుపులు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
 
ఇక సాంకేతికంగా
 
సురేష్ బొబ్బిలి నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంది. ఇంట్రడక్షన్ సాంగ్ బాగుంది.  అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను పెంచింది. అంజి సినిమాటోగ్రఫీ బాగుంది  సన్నివేశాలను వాస్తవికంగా చిత్రీకరించారు. సహజ ప్రదేశాలు బాగా చిత్రీకరించబడ్డాయి. శివ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది మరియు కొంచెం మెరుగ్గా ఉండవచ్చు. షార్ట్ రన్ టైమ్ ప్రాజెక్ట్‌కు అదనపు ప్రయోజనం. ఉత్పత్తి విలువలు బాగున్నాయి.
 
ప‌రిమిత బ‌డ్జెట్‌తోనూ ప‌రిమిత న‌టీన‌టుల‌తో ఈ సినిమాను ఆవిష్క‌రించ‌డం విశేషం. చిన్న పాయింట్ అయినా కొడుకు కోసం త‌పించే త‌ల్లిదండ్రుల వేద‌న‌, బాధ ఇందులో స్ప‌ష్టంగా చూపించాడు. ఎక్క‌డా విసుగు తెప్పించ‌కుండా స‌స్పెన్స్‌ను చివ‌ర‌లో చెప్పి మ‌రింత ఆక‌ట్టుకున్నాడు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాలు చూసేవావారికి ఇంత ఆక‌ట్టుకుంటుంది. చిన్న సినిమాగా తీసినా ఒక‌టి అరా లోపాలున్నా ఈ సినిమా చూడ‌ద‌గ్గ సినిమా. మ‌రీ భ‌య‌పెట్ట‌క‌పోయినా మాన‌వ నైజంలోని మ‌రో కోణం ఇందులో చూపించాడు. ఇలాంటి త‌ల్లిదండ్రులు స‌మాజంలో చాలామందే వున్నారనే చెప్పే ప్ర‌య‌త్నం. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఊహించ‌ని ముగింపు ఆస‌క్తిక‌రం.
 
రేటింగ్ః 3/5