తమిళ్ - తెలుగు ప్రజల గొడవల నేపథ్యంగా ఛలో (ట్రైలర్)

యువ హీరో నాగశౌర్య వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఛలో అనే పేరుపెట్టిన విషయం తెల్సిందే. రొమాంటిక్, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రంలో రష్మిక మదన్నా హీ

chalo movie still
pnr| Last Updated: గురువారం, 18 జనవరి 2018 (13:55 IST)
యువ హీరో నాగశౌర్య వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఛలో అనే పేరుపెట్టిన విషయం తెల్సిందే. రొమాంటిక్, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రంలో రష్మిక మదన్నా హీరోయిన్.

నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. అయితే, ఈ సినిమా టీజర్, సాంగ్స్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తాజాగా "ఛలో" మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళియన్లకు, తెలుగువారికి మధ్య గొడవలను ఇతివృత్తంగా తీసుకుని ఫుల్ కామెడీతో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా, ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కానుంది.

దీనిపై మరింత చదవండి :