శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (10:52 IST)

ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేసి ఇపుడు నీకు హగ్ కావాలా? 'చి.ల.సౌ' ట్రైలర్

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం "చి.ల.సౌ". అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్స్‌ కలిసి సంయుక్తంగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయ

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం "చి.ల.సౌ". అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్స్‌ కలిసి సంయుక్తంగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీలో సుశాంత్ సరసన రుహాణీ శర్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున చేతులమీదుగా శనివారం రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని నాగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
ట్రైలర్ విషయానికొస్తే.. సుశాంత్ పెళ్లి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్, రుహానీలపై ట్రైలర్ మొదలవుతుంది. 'పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో అని ఎన్ని సార్లు అడుక్కోవాల'ని సుశాంత్ తల్లి సీరియస్.. నచ్చజెప్పడం అన్నీ చాలా అందంగా తెరకెక్కించినట్టుగా ఉంది. 
 
ముఖ్యంగా, హీరోహీరోయిన్ల మధ్య సీన్స్ ఇట్టే ఆకట్టుకునేలా రూపొందించినట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. హైదరాబాద్‌‌లో ఉండే హ్యాండ్‌సమ్ అబ్బాయిల్ని ఏమంటారో తెలుసా టూరిస్ట్ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్స్ యూత్‌‌కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌‌గా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీని ఆగష్టు 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసింది.