తరుణ్ భాస్కర్ "ఈ నగరానికి ఏమైంది" ట్రైలర్...

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న చిత్రం "ఈ నగరానికి ఏమైంది". 'పెళ్లిచూపులు' చిత్ర ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది

EeNagaranikiEmaindhi
pnr| Last Updated: ఆదివారం, 10 జూన్ 2018 (16:02 IST)
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న చిత్రం "ఈ నగరానికి ఏమైంది". 'పెళ్లిచూపులు' చిత్ర ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. 'నీ గ్యాంగ్‌తో థియేట‌ర్‌కు రా చూసుకుందాం' అనే ఆసక్తికర ఉప శీర్షికతో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ ట్రైలర్‌లో హైదరాబాద్ యాసతో కూడిన డైలాగ్‌లు అలరిస్తున్నాయి. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథగా ఈ సినిమా ఉండనుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతమందిస్తున్నారు.
 
'మనం కూడా ఈ సాయంత్రం మధ్యపానంలో మునిగి తేలాల్సిందే' అంటూ ఈ ట్రైలర్‌లో ఓ డైలాగ్‌ వదిలారు. అలాగే, 'ఈరోజు ఆఫీస్‌కి ఎందుకుపోలే' అని ఒకరు అడగగా, 'నాగుల పంచమి ఇయ్యాల' అని ఓ నటుడు సమాధానం ఇస్తున్నాడు. ఈ ట్రైలర్‌ను మీరూ చూసి ఆనందించండి. 


 దీనిపై మరింత చదవండి :