మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (13:04 IST)

కంగువా నుంచి హీరో సూర్య టీజర్ లుక్

Surya -kanguva look
Surya -kanguva look
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం కంగువా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు లుక్ లు విడుదలయ్యాయి. తాజాగా ఈరోజు సాయంత్రం చెన్నైలో టీజర్ విడుదలకానుంది. దానికి సంబంధించిన సూర్య లుక్ ను ముందుగా విడుదలచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శివ దర్శకత్వం లో రూపొందుతోంది.
 
ఈ పోస్టర్ లో కండలు తిరిగిన శరీరం తో సూర్య లుక్ ఇవ్వగా, భీకర పోరాట సన్నివేశం చుట్టు పక్కల కనిపిస్తుంది. దీనికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సాయంత్రం టీజర్ కు మరింత క్రేజ్ రానున్నందని కామెంట్లు చేస్తున్నారు. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ల సహకారంతో స్టూడియో గ్రీన్‌ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.