సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (17:57 IST)

అద‌ర‌కొడుతున్న విజ‌య రాఘ‌వ‌న్ ట్రైల‌ర్‌ (video)

Vijay Antony
విజయ్ ఆంటోని క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `విజ‌య రాఘ‌వ‌న్‌`. ఆనంద కృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ట్రైల‌ర్ సోమ‌వారంనాడు విడుద‌లైంది. ఇందులో దేశంలో రాజ‌కీయ పార్టీ, సంఘ ద్రోహులపై ఎక్కుపెట్టిన అస్త్రంగా వుంది. ఆత్మిక నాయిక‌గా న‌టించింది. త‌మిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేస్తున్నారు. బిచ్చ‌గాడు త‌ర్వాత విజ‌య్ ఆంటోనికి అంత హిట్ రాలేదు. కానీ విజ‌య రాఘ‌వ‌న్ ట్రైల‌ర్ చూశాక అది పూర్తి చేస్తుంద‌ని భావిస్తున్నారు.
 
ఏముందంటే..
- స్కూల్‌లో చ‌దివే పిల్ల‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. బ్లేడు శ్రీ‌ను, గంజాయి మ‌ల్లేష్‌, గుడుంబా రాజు.. వాళ్ళు నేర‌స్తులు. అస‌లు నేర‌స్తుల్ని ప‌ట్టుకోకుండా స్కూల్ పిల్ల‌ల్ని అరెస్ట్ చేస్తారేంటిరా అంటూ ఓ వ్య‌క్తి ఘాటుగా ప్ర‌శ్నిస్తాడు.
 
- రౌడీలను ఎదురిస్తున్న విజ‌య్ రాఘ‌వ‌న్‌ను.. ఏదైనా తేడా వ‌చ్చిందా.. పేగులు మెడ‌లో వేసుకుంటా అంటూ రౌడీలు డైలాగ్‌.
 
- ఓ కాల‌నీలో స్కూల్ పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతూ, ఐ.ఎ.ఎస్‌.కు విజ‌య్ ప్రిపేర్ అవుతుంటాడు.
 
- పాడ‌వ‌కుండా వుండాల‌ని ఆధార్‌కార్డ్‌ను లామినేట్ చేస్తారు. కానీ చెద‌ల‌ప‌ట్టిన మా జీవితాల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదంటూ ఓ మ‌హిళ ఆవేద‌న‌
 
- జీత‌మేలేని కార్పొరేట‌ర్ సీటుకు పార్టీ కోటి ఇచ్చి కొంటుంది. ల‌క్ష జీవితం వున్న ఎం.ఎల్‌.ఎ.కు 10 కోట్లు, ఎం.పి.సీటుల‌కు 25 కోట్లు ఇచ్చి కొనుకుంటున్నారు. వీరంతా గెలిచి ఏం పీకుతున్నారో అంద‌రికీ తెలిసిందే.. అంటూ ఆవేశంగా విజ‌య్ అసెంబ్లీలో బ‌ల్ల‌గుద్ది వాదిస్తుంటాడు.
 
- ఓ కాల‌నీలో ఓ పార్టీ నాయ‌కుడు..న‌న్ను గెలిపిస్తే ఏడాదిలో మ‌న కాల‌నీని సింగ‌పూర్‌గా మారుస్తా అంటూ వాగ్దానం చేస్తాడు. ఆ వెంట‌నే.  అక్క‌డి మ‌హిళ‌లు.. సింగ‌పూర్‌, జ‌పాన్‌లా చేస్తామంటూ.. మా ఊరిని స్మ‌శానంలా మార్చేశారు. అంద‌రూ మోస‌గాళ్ళే... అంటూ అంటుంది.  
 
ఇలా విజ‌య‌రాఘ‌వన్ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌కాగానే అనూహ్య‌స్పంద‌న ల‌భించింది.