మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 7 జనవరి 2019 (18:50 IST)

నాకు ఆ రెండూ ఇస్తే పోటీ చేస్తానంటున్న నటుడు అలీ... నిజమా?

గత రెండురోజులుగా సినీ నటుడు అలీ వార్తల్లో నిలుస్తున్నారు. అటు సామాజిక మాథ్యమాలు, ఇటు ప్రసార మాధ్యమాల్లోను అలీపైనే చర్చ జరుగుతోంది. 20 సంవత్సరాలు టిడిపిలో ఉన్న అలీ ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. అందుకే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు అలీ. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్‌ వెంట వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
 
ఎలాంటి క్లారిటీ లేకుండా అలీ వేస్తున్న అడుగులు సినీ రంగంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా అలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గుంటూరు జిల్లాలో తను అడిగిన ప్రాంతంలో ఎమ్మెల్యేగా టిక్కెట్టు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇస్తే ఏ పార్టీలోనైనా పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు అలీ. నటులు సినీ రంగంలోకి వస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. మరి అలీ అడిగిన ఆ రెండూ ఏ పార్టీ ఇస్తుందో చూడాలి.